న్యూఢిల్లీ 29 అక్టోబర్ (హి.స.) ఉక్రెయిన్పై యుద్ధానికి
మద్దతుగా ఉత్తర కొరియా . రష్యాకు భారీగా సైన్యాన్ని తరలిస్తోంది. కిమ్ 12 వేల మంది సైనికులను రష్యాకు తరలిస్తున్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు వెల్లడించారు. ఉక్రెయిన్పై యుద్ధంలో పాలు పంచుకునేందుకు ఇప్పటికే 3వేల మంది ఉత్తర కొరియా సైనికులు రష్యా భూభాగంలోకి ప్రవేశించారని ఆయన వెల్లడించారు. దాదాపు 12 వేల మంది ఉత్తర కొరియా సైనికుల సహకారంతో రష్యా తమ భూభాగంపై దండెత్తే అవకాశం ఉందని జెలెన్స్కీ ఆరోపించారు. ఈ వారాంతంలో ఉక్రెయిన్ చుట్టూ మోహరించడానికి అవి సిద్ధమవుతున్నట్లుగా తమకు సమాచారం అందిందని జెలెన్స్కీ వెల్లడించారు. రష్యా- ఉక్రెయిన్ యుద్ధంలో ఉత్తరకొరియా చేరితే మూడో ప్రపంచయుద్ధం తప్పదని చెప్పుకొచ్చారు.
మరోవైపు, ఉక్రెయిన్తో మరింతగా పోరాడేందుకు ఉత్తర కొరియా తన బలగాలను రష్యాలోకి తరలిస్తోందని నాటో కూడా ధ్రువీకరించింది. రష్యాలోని కుర్క్స్ ప్రాంతంలో కొన్ని బలగాలను ఇప్పటికే మోహరించినట్లు నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే మీడియాకు తెలిపారు. ఉక్రెయిన్- రష్యా యుద్ధంలో ఉత్తర కొరియా జోక్యం చేసుకోవడం కరెక్ట్ కాదని.. దీంతో, ప్రస్తుత పరిస్థితి మరింత దిగజరుతోందన్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మరింత తీవ్రమయ్యే అవకాశాలు కనిపిస్తుండటంతో ప్రపంచ దేశాలు కూడా ఈ విషయంపై ఆందోళన చెందుతున్నాయి. ఒకవేళ ఉత్తర కొరియా సైనికులు ఉక్రెయిన్ యుద్ధంలోకి చొరబడితే.. కచ్చితంగా వాళ్లు కూడా లక్ష్యాలుగా మారతారని అమెరికా గతంలోనే హెచ్చరించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..