జనగామ, 14 నవంబర్ (హి.స.) జనగామ జిల్లా ఎల్లారెడ్డిగూడెం గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. బుధవారం రాత్రి సుమారు రాత్రి 12 గంటలకు పర్వత మహేందర్, గంపల పరుశరాములు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో పరశురాములు అనే వ్యక్తి మహేందర్ చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. పెళ్ళిలో చిన్న వివాదాలు చోటు చేసుకున్నాయని, ప్రాధమిక అంచనా ప్రకారం ఆ వివాదాలే హత్యకు కారణమా లేక ఏమైన ఉన్నాయా అని తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..