ఫిలిప్పీన్స్ దేశంలో అనుమాదాస్పత స్థితిలో మృతి చెందిన హైదరాబాద్ విద్యార్థిని
హైదరాబాద్, 15 నవంబర్ (హి.స.) ఎంబీబీఎస్ విద్య అభ్యసించడానికి ఫిలిప్పీన్స్ దేశం వెళ్లి అనుమానాస్పద స్థితిలో విద్యార్థిని మృతి చెందింది. ఈ ఘటన పటాన్ చెరు ప్రాంతంలో విషాదం నింపింది. స్థానికులు తెలిపిన సమాచారం ప్రకారం పటాన్ చెరు మండలం ఇంద్రేశం గ్రామపంచ
ఫిలిప్పీన్స్ లో మెడికో మృతి


హైదరాబాద్, 15 నవంబర్ (హి.స.)

ఎంబీబీఎస్ విద్య అభ్యసించడానికి

ఫిలిప్పీన్స్ దేశం వెళ్లి అనుమానాస్పద స్థితిలో విద్యార్థిని మృతి చెందింది. ఈ ఘటన పటాన్ చెరు ప్రాంతంలో విషాదం నింపింది. స్థానికులు తెలిపిన సమాచారం ప్రకారం పటాన్ చెరు మండలం ఇంద్రేశం గ్రామపంచాయతీ పరిధిలో నివాసముంటున్న చింత అమృత్ రావు కుమార్తె చింత స్నిగ్ధ (17) ఫిలిప్పీన్స్ దేశంలోని పర్పెక్చువల్ హెల్త్ యూనివర్సిటీ మనీలాలో ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. అయితే స్నిగ్ధ పుట్టినరోజు నాడే అనుమానాస్పదంగా మృతి చెందినట్లు చెబుతున్నారు. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో స్నిగ్ధ చనిపోయినట్లు అక్కడ తోటి విద్యార్థినిలు తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. విద్యార్థిని మృతి వార్తతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. మృతురాలు స్నిగ్ధ తండ్రి అమృత్ రావు సంగారెడ్డి విద్యుత్ శాఖ విజిలెన్స్ డీఈ గా విధులు నిర్వహిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande