విజయవాడ, 21 నవంబర్ (హి.స.)
ఈనాడు, సిరిసిల్ల, కరీంనగర్ న్యూస్‌టుడే- వేములవాడ, వేములవాడ గ్రామీణం: భక్తి పారవశ్యంతో ‘ఓం.. నమః శివాయ’.. అంటూ రాజరాజేశ్వరుడిని స్మరిస్తూ.. ‘మాది ముమ్మాటికి ప్రజల ప్రభుత్వమేనని’ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చేసిన.. చేయాల్సిన అభివృద్ధిని వివరిస్తూ.. సాగిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వేములవాడ పర్యటన విజయవంతమైంది. దాదాపు నాలుగున్నర గంటలపాటు ఇక్కడ సందడి చేసిన సీఎం ఇందిరమ్మ రాజ్యంతో ఇక్కడి ప్రజల ఆకాంక్షలు నెరవేరబోతున్నాయని.. ఈ ప్రాంతానికి అభివృద్ధి నిధులు అందుతున్నాయని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌లతోపాటు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డిలు మాట్లాడి.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడి ప్రజలకు అండగా నిలబడుతున్న తీరుని వివరించారు. నాలుగు జిల్లాల ప్రజల ఆకాంక్షలు మరిన్నింటిని నెరవేర్చాలని సీఎంను సభాముఖంగా కోరారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల