దేశ టెలికాం సంస్థల ఒడిదొడుకులు... భారీ సంఖ్యలో వినియోగదారులను కోల్పోతున్న కంపెనీలు..
బిజినెస్, 21 నవంబర్ (హి.స.) టారిఫ్లను ఖరీదైనవిగా మార్చిన తర్వాత టెలికాం కంపెనీలు నిరంతరం ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) సెప్టెంబర్ నెల చందాదారుల డేటాను విడుదల చేసింది. ట్రాయ్ విడుదల చేసిన డేటాను పరిశీలిస
బిజినెస్ న్యూస్


బిజినెస్, 21 నవంబర్ (హి.స.)

టారిఫ్లను ఖరీదైనవిగా మార్చిన తర్వాత టెలికాం కంపెనీలు నిరంతరం ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) సెప్టెంబర్ నెల చందాదారుల డేటాను విడుదల చేసింది. ట్రాయ్ విడుదల చేసిన డేటాను పరిశీలిస్తే , Reliance Jio, Airtel, Vi టెలికాం సంస్థల పరిస్థితి చాలా దారుణంగా ఉందని స్పష్టమవుతోంది. మరోవైపు ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ లాభపడుతోంది. సెప్టెంబరు నెలలో టెలికాం కంపెనీలు కోటి మందికి పైగా సబైబర్లను కోల్పోయినట్లు తెలుస్తోంది.

సెప్టెంబర్ నెలలో భారతీ ఎయిర్టెల్ 14 లక్షల మంది వినియోగదారులను కోల్పోగా, వోడాఫోన్ ఐడియా 15 లక్షల మందిని కోల్పోయింది. ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాల కంటే ముఖేష్ అంబానీకి చెందిన టెలికాం కంపెనీ రిలయన్స్ జియో భారీ నష్టాలను చవిచూసింది. సెప్టెంబర్ నెలలో జియో దాదాపు 79 లక్షల మంది సబ్స్క్రైబర్లను కోల్పోయింది. అంటే ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాతో పోలిస్తే జియో పరిస్థితి మరింత దారుణంగా మారిందని తెలిసిపోతుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్


 rajesh pande