40 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న ఏపీ పోలీసులు
తూర్పుగోదావరి, 23 నవంబర్ (హి.స.) తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లిలో అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న వారిపై దేవరపల్లి పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. దేవరపల్లి జాతీయ రహదారిపై
గంజాయి స్వాధీనం


తూర్పుగోదావరి, 23 నవంబర్ (హి.స.)

తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లిలో

అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న వారిపై దేవరపల్లి పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. దేవరపల్లి జాతీయ రహదారిపై మోటార్ సైకిళ్లపై రవాణా చేస్తున్న నలబై కేజీల గంజాయిని, రెండు మోటార్ సైకిళ్ళను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ముందస్తుగా వచ్చిన సమాచారం మేరకు దేవరపల్లి పోలీసులు తనిఖీలు నిర్వహించారు. విశాఖ ఏజెన్సీ ప్రాంతం నుంచి కేరళ, కోయంబత్తూర్కు అక్రమంగా రవాణా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande