సెంబర్ 15న డబ్ల్యూపీఎల్‌ వేలం.. వేదిక ఎక్కడంటే?
విజయవాడ, 29 నవంబర్ (హి.స.)మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) 2025 వేలంకి ముహూర్తం ఖరారైంది. బెంగళూరులో డిసెంబరు 15న మినీ వేలం నిర్వహించనున్నారు. ప్రతి ఫ్రాంచైజీకి రూ.15 కోట్ల బడ్జెట్‌ కేటాయించారు. గత సీజన్‌ రూ.13.5 కోట్లు ఉండగా.. ఈసారి 1.5 కోట్లు
సెంబర్ 15న డబ్ల్యూపీఎల్‌ వేలం.. వేదిక ఎక్కడంటే?


విజయవాడ, 29 నవంబర్ (హి.స.)మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) 2025 వేలంకి ముహూర్తం ఖరారైంది. బెంగళూరులో డిసెంబరు 15న మినీ వేలం నిర్వహించనున్నారు. ప్రతి ఫ్రాంచైజీకి రూ.15 కోట్ల బడ్జెట్‌ కేటాయించారు. గత సీజన్‌ రూ.13.5 కోట్లు ఉండగా.. ఈసారి 1.5 కోట్లు పెరిగింది. ఏడుగురు ఆటగాళ్లను విడుదల చేసినందున గుజరాత్ జెయింట్స్ వద్ద అత్యధికంగా రూ.4.4 కోట్లు ఉన్నాయి. ఛాలెంజర్స్ బెంగళూరు వద్ద రూ.3.25 కోట్లు, ఢిల్లీ క్యాపిటల్స్‌ వద్ద రూ.2.5 కోట్లు ఉన్నాయి. ఈసారి వేలంలో హీథర్‌ నైట్‌, లీ తహుహు, నాడిన్‌ డి క్లెర్క్‌, స్నేహ్‌ రాణా, డియాండ్ర డాటిన్‌, లారెన్‌ బెల్‌, పూనమ్‌ యాదవ్, వేద కృష్ణమూర్తి ఉన్నారు. వేలానికి ముందు ఫ్రాంచైజీల మధ్య జరిగే బదిలీల గడువు ముగియగా.. ఒక్క బదిలీ మాత్రమే జరిగింది. యూపీ వారియర్స్‌ నుంచి ఒక్క డ్యానీ వ్యాట్‌ (ఇంగ్లండ్‌)ను ఆర్‌సీబీ తీసుకుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల


 rajesh pande