బాంబు బెదిరింపులు.. సాంకేతిక లోపాలు.. ప్రశాంతంగానే సాగుతున్న అమెరికా ఎన్నికలు! 
పెన్సిల్వేనియా 6 నవంబర్ (హి.స.) అమెరికాలో అధ్యక్ష ఎన్నికల (US Elections) పోలింగ్‌ ప్రక్రియ చాలావరకు ప్రశాంతంగానే సాగుతోంది. అక్కడక్కడ సాంకేతిక సమస్యలు, బ్యాలెట్‌ ప్రింటింగ్‌లో లోపాలు, వాతావరణ సంబంధిత ఇక్కట్లు, బూటకపు బెదిరింపులు వంటి ఘటనలు ఎదురైనప్పట
బాంబు బెదిరింపులు.. సాంకేతిక లోపాలు.. ప్రశాంతంగానే సాగుతున్న అమెరికా ఎన్నికలు! 


పెన్సిల్వేనియా 6 నవంబర్ (హి.స.) అమెరికాలో అధ్యక్ష ఎన్నికల (US Elections) పోలింగ్‌ ప్రక్రియ చాలావరకు ప్రశాంతంగానే సాగుతోంది. అక్కడక్కడ సాంకేతిక సమస్యలు, బ్యాలెట్‌ ప్రింటింగ్‌లో లోపాలు, వాతావరణ సంబంధిత ఇక్కట్లు, బూటకపు బెదిరింపులు వంటి ఘటనలు ఎదురైనప్పటికీ.. ఓటర్లు మాత్రం ఉత్సాహంగా ముందుకొస్తున్నారు. రిపబ్లికన్‌, డెమోక్రటిక్‌ అభ్యర్థులు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump), కమలా హారిస్‌ (Kamala Harris)ల మధ్య తీవ్ర పోటీ నెలకొనడంతో.. ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది.

స్వింగ్‌ రాష్ట్రమైన పెన్సిల్వేనియాలో రిపబ్లికన్‌ పోలింగ్‌ పర్యవేక్షకులను కొన్ని ఎన్నికల కేంద్రాల్లో అనుమతించలేదనే వార్తలు వచ్చాయి. అయితే, సమస్య పరిష్కారమైనట్లు అధికారులు తెలిపారు.

పెన్సిల్వేనియాలోని కేంబ్రియా కౌంటీలో బ్యాలెట్‌ స్కానింగ్‌ యంత్రాల్లో లోపాలు తలెత్తాయి. దీంతో పోలింగ్‌ సమయాన్ని మరో రెండుగంటల పాటు పొడిగించాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.

ఇల్లినోయీలోని ఛాంపియన్‌ కౌంటీలో సాంకేతిక లోపాలు, కెంటకీలోని లూయీవిల్‌లో ఈ-పోల్‌బుక్‌లతో సవాళ్లు వంటివి ఓటింగ్‌ ప్రక్రియ ఆలస్యానికి కారణమయ్యాయి.

ఆరిజోనాలోని మారికోపా కౌంటీలో.. పోలింగ్‌ కేంద్రం తాళం చెవి మర్చిపోవడంతో కొద్దిగా ఆలస్యమైంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande