తెలంగాణ, 18 డిసెంబర్ (హి.స.)
ఇరుదేశాల సంబంధాన్ని మెరుగు పరిచేందుకు భారత్ తో కలిసి పనిచేస్తామని చైనా ప్రకటించింది. 'అంతర్జాతీయ పరిస్థితులు చైనా విదేశాంగ సంబంధాలు' అనే కార్యక్రమంలో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ పాల్గొన్నారు. ఈక్రమంలోనే ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాన్ని స్థిరమైన అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తామన్నారు. 'ఇరు దేశాలు అభివృద్ధి చెందేందుకు భారత్ తో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. ఆసియా దేశాలతో స్వేచ్ఛ, వాణిజ్య ఒప్పందానికి సిద్ధంగా ఉన్నాం' అని తెలిపారు. రష్యాలో జరిగిన బ్రిక్స్ సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోడీ తో చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ తో భేటీ జరిగిందని వాంగ్ యీ గుర్తుచేశారు. ఆ సమయంలో ఇరుదేశాల సంబంధాల మెరుగుదలకు ముఖ్యమైన ప్రతిపాదనలు సమర్పించినట్లు వెల్లడించారు. దీనికి మోడీ నుంచి సానుకూలమైన స్పందన వచ్చిందన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు, జర్నలిస్ట్