దక్షిణ కొరియాలో ఘోర విమాన ప్రమాదం.. 179 మంది సజీవ దహనం..
హైదరాబాద్, 29 డిసెంబర్ (హి.స.) దక్షిణ కొరియాలోని ముయాన్‌ ఎయిర్‌పోర్టులో ఆదివారం ఉదయం ఘోర విమాన ప్రమాదం జరిగింది. థ్యాయ్‌లాండ్‌ రాజధాని బ్యాంకాక్‌ నుంచి ముయాన్‌కు వచ్చిన బెజూ ఎయిర్‌ ఫ్లైట్‌కు చెందిన 7C2216 బోయింగ్‌ విమానం ల్యాండ్ అవుతుండగా అదుపుతప్పి
విమాన ప్రమాదం


హైదరాబాద్, 29 డిసెంబర్ (హి.స.)

దక్షిణ కొరియాలోని ముయాన్‌ ఎయిర్‌పోర్టులో ఆదివారం ఉదయం ఘోర విమాన ప్రమాదం జరిగింది. థ్యాయ్‌లాండ్‌ రాజధాని బ్యాంకాక్‌ నుంచి ముయాన్‌కు వచ్చిన బెజూ ఎయిర్‌ ఫ్లైట్‌కు చెందిన 7C2216 బోయింగ్‌ విమానం ల్యాండ్ అవుతుండగా అదుపుతప్పింది. రన్‌వేపై రక్షణ గోడను ఢీకొని పేలిపోయింది. భారీగా మంటలు చెలరేగాయి. దీంతో విమానంలోని 179 మంది సజీవదహనమయ్యారు. ఇద్దరు మాత్రమే ప్రాణాలతో బయపడ్డారు. ఘటనా సమయంలో విమానంలో 175 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది సహా మొత్తం 181 మంది ఉన్నట్లు జెజూ విమానయాన సంస్థ ప్రకటించింది. కాగా, విమానం ల్యాండ్‌ కావడానికి ప్రయత్నించిన సమయంలో ల్యాండింగ్‌ గేర్‌ సమస్యతోనే ప్రమాదం జరిగినట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

విమానం రన్‌వేపై ల్యాండ్‌ అవుతున్న సమయంలో ముందు చక్రం తెరుచుకోకపోవడంతో విమానం రన్‌వేకు తగిలింది. ఈ క్రమంలో విమానం అదుపు తప్పి రన్‌వే పక్కన ఏర్పాటు చేసిన కాంక్రీటు గోడను ఢీకొట్టడంతో విమానంలో ఇంధనం మండిపోయి మంటలు వ్యాపించాయని తెలిపారు. 32 అగ్ని మాపక ట్రక్కులు, హెలికాప్టర్లు హుటాహుటిన అక్కడి చేరుకుని మంటలను అదుపు చేశాయి. అయితే అప్పటికే అంతా మృత్యువాతపడ్డారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్


 rajesh pande