తెలంగాణ, 2 జనవరి (హి.స.)
మరోసారి చైనాలో హెల్త్ ఎమర్జెన్సీ..
మరోసారి చైనా వైరస్ల బారిన చిక్కుకుని విలవిలలాడుతుంది. పలు రకాల వైరస్ల వ్యాప్తితో చైనా ప్రజలు పెద్ద సంఖ్యలో ఆస్పత్రుల పాలవుతుండటంతో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. చైనాలో మల్టిపుల్ వైరస్ల మూకుమ్మడి వ్యాప్తి నేపధ్యంలో ఆ దేశంతో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించారు. కోవిడ్-19తో పాటు ఇన్ఫ్లుయెంజా-A, HMPV, మైకోప్లాస్మా న్యూమోనియా వంటి వైరస్లు చైనాలో విస్తృతంగా వ్యాప్తి చెందుతున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు, జర్నలిస్ట్