సిద్దిపేట జిల్లా కేంద్రంలో విషాదం.. బాలుడి ప్రాణం తీసిన గాలిపటం..
హైదరాబాద్, 26 డిసెంబర్ (హి.స.) సిద్ధిపేట జిల్లా కేంద్రంలో విషాదం నెలకొంది. గాలిపటం ఓ బాలుడి ప్రాణం తీసింది. గాలిపటం ఎగరవేస్తూ చెరువులో పడి చనిపోయాడు. లెక్చరర్స్ కాలనీలో ఉండే తేజ (11) గాలిపటం ఎగరవేస్తుండగా ప్రమాదవశాత్తు గాలిపటం దారం తెగిపోయి.. సమీప
సిద్దిపేటలో విషాదం


హైదరాబాద్, 26 డిసెంబర్ (హి.స.)

సిద్ధిపేట జిల్లా కేంద్రంలో విషాదం నెలకొంది. గాలిపటం ఓ బాలుడి ప్రాణం తీసింది. గాలిపటం ఎగరవేస్తూ చెరువులో పడి చనిపోయాడు. లెక్చరర్స్ కాలనీలో ఉండే తేజ (11) గాలిపటం ఎగరవేస్తుండగా ప్రమాదవశాత్తు గాలిపటం దారం తెగిపోయి.. సమీపంలో ఉన్న చెరువులో పడింది. దీంతో.. గాలిపటం కోసం వెళ్లిన ఆ బాలుడు మృత్యుఒడిలోకి వెళ్లిపోయాడు. గాలిపటం తెచ్చుకుందామని చెరువు దగ్గరికి వెళ్లిన బాలుడు.. గాలిపటం కోసం చెరువులోకి దిగాడు. దీంతో.. బాలుడికి ఈత రాకపోవడంతో తేజ గల్లంతయ్యాడు. అనంతరం.. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు.. చెరువు దగ్గరికి వెళ్లి పరిశీలించారు. ఈ ప్రమాదంపై పోలీసులకు సమాచారం అందించారు. దీంతో.. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. స్థానికుల సహాయంతో బాలుడి మృతదేహాన్ని బయటకు తీశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్


 rajesh pande