ప్రభుత్వ రంగ టెలికాం   సంస్థ బిఎస్ఎన్ఎల్ కీలక నిర్ణయం..
హైదరాబాద్, 29 డిసెంబర్ (హి.స.) ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) మరోసారి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగులను తగ్గించుకుని, బ్యాలెన్స్ షీట్ మెరుగు పరిచేందుకు సిద్ధమవుతోంది. ఇందు కోసం మరోసారి ఉద్యోగుకు
బిఎస్ఎన్ఎల్ కీలక నిర్ణయం


హైదరాబాద్, 29 డిసెంబర్ (హి.స.)

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) మరోసారి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగులను తగ్గించుకుని, బ్యాలెన్స్ షీట్ మెరుగు పరిచేందుకు సిద్ధమవుతోంది. ఇందు కోసం మరోసారి ఉద్యోగుకు స్వచ్ఛంద పదవీ విరమణ పథకం (వీఆర్ఎస్) అమలు చేయాలని యోచిస్తోంది. ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం కోరేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ వీఆర్ఎస్ ద్వారా 35 శాతం మంది ఉద్యోగులను తగ్గించుకోవాలని చూస్తోందని సమాచారం. ఇందుకోసం వీఆర్ఎస్ అమలుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి రూ.15 వేల కోట్లను డాట్ కోరినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ టెలికాం సంస్థకు వచ్చే ఆదాయంలో రూ.7,500 కోట్లు అంటే సుమారు 38 శాతం మేర ఉద్యోగుల వేతనాల కోసమే కేటాయిస్తోందట. ఈ వ్యయాన్ని రూ.5 వేల కోట్లకు తగ్గించుకోవాలని టెలికాం సంస్థ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్


 rajesh pande