హైదరాబాద్, 4 డిసెంబర్ (హి.స.)
తెలంగాణ రాష్ట్రంలో బుధవారం తెల్లవారుజామున భూకంపం (Earthquake) సంభవించింది. కాగా దీనికి సంబంధించిన భూకంప కేంద్రం (epicenter) ములుగు జిల్లాలో కేంద్రీకృతం అవ్వగా.. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.3 గా నమోదైంది. ఇదిలా ఉంటే ఈ భూకంపం కారణంగా తెలంగాణ రాష్ట్రంలో పలు ఉమ్మడి జిల్లాలో 2 నుంచి 5 సెకన్లపాటు.. ఉదయం 7.20 నిమిషాల తర్వాత ప్రకంపణలు వచ్చాయి. దీంతో ప్రజలు ఎమ్ జరుగుతుందో తెలియక తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కాగా కొద్ది సేపటికే ప్రకంపణలు తగ్గిపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ భూకంపానికి సంబంధించిన వీడియోలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.
ఈ క్రమంలో.. దేశంలోనే రెండో అతిపెద్ద జాతర జరిగే మేడారానికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోలు తెల్లవారుజామున.. ఆలయ పూజారులు.. సారక్క గద్దె పై పూజలు చేస్తుండగా.. ఒక్కసారిగా భూమి కంపించింది. దీంతో అమ్మవారి గద్దె మొత్తం ప్రకంపణలకు గురైంది. దీంతో ఆలయ పూజారి ఆందోళనకు గురి కావడం ఆ వీడియో లో స్పష్టంగా కనిపించింది. ఏది ఏమైనప్పటికి బుధవారం తెల్లవారుజామున తెలంగాణ ప్రాంతాన్ని స్వల్ప భూకంపం భయాందోళనకు గురిచేసిందనే చెప్పుకొవాలి.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..