హైదరాబాద్, 7 డిసెంబర్ (హి.స.)
చత్తీస్గడ్ బీజాపూర్ జిల్లా, బాసగూడ
పోలీస్ స్టేషన్ పరిధిలోని తిమ్మాపూర్ గ్రామంలో మావోయిస్టులు అంగన్వాడీ కార్యకర్తను హత్య చేశారు. బీజాపూర్ సీఆర్పీఎఫ్ క్యాంపు నుండి 1 కి.మీ. దూరంలో అంగన్వాడీ కార్యకర్త దారుణ హత్యకు గురికావడం ప్రజలను భయాందోళనకు గురిచేసింది. అంగన్వాడీ కార్యకర్త లక్ష్మికి మావోయిస్టుల నుండి ఇప్పటికే రెండుసార్లు హెచ్చరిక వచ్చినట్లు సమాచారం. అంగన్వాడీ కార్యకర్తను ఇంటి నుంచి బయటకు తీసుకెళ్లి కుమారుడి ఎదుటే రాత్రి 8 గంటల సమయంలో పదునైన ఆయుధాలతో దాడి చేశారు. రక్షించేందుకు వచ్చిన కొడుకుతో దుండగులు గొడవ పడ్డారు. ఇన్ ఫార్మర్ వ్యవహరిస్తున్నందునే అంగన్వాడీ కార్యకర్త లక్ష్మిని మావోలు హత్య చేసినట్లుగా సమాచారం.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్