హైదరాబాద్, 8 డిసెంబర్ (హి.స.)
సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో హిట్ అండ్
రన్ కేసు నమోదు అయ్యింది. తెల్లవారుజామున బైక్ పై వెళ్తున్న ఇద్దరిని గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టి వెళ్లిపోయింది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. మృతులిద్దరు పోలీసులుగా గుర్తించారు. మృతులు సిద్దిపేట జిల్లా పెద్దాకోడూరు, గాడిచర్లపల్లి గ్రామంగా తెలిపారు. దౌల్తాబాద్, రాయపోల్ పోలీస్ స్టేషన్లలో వెంకటేష్, పరంధాములు కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్లో జరిగే మారథాన్లో పాల్గొనేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..