ముంబయి 9 డిసెంబర్ (హి.స.)
అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ట్రేడింగ్ మొదలుపెట్టాయి. ఉదయం 9.21 సమయానికి సెన్సెక్స్ 68 పాయింట్లు నష్టపోయి 81,640 వద్ద, నిఫ్టీ 35 పాయింట్లు కుంగి 24,672 వద్ద కొనసాగుతున్నాయి. సియెట్ లిమిటెడ్, ఐటీఐ, జీటీఎల్ ఇన్ఫ్రా, అశోక్ బిల్డ్కన్ లాభాల్లో ఉండగా.. గోద్రెజ్ కన్జ్యూమర్, బయోకాన్, మ్యాక్స్ హెల్త్కేర్, అవలాన్ టెక్నాలజీస్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.
FMCG, మీడియా షేర్లు ఢమాల్..స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఆసియా మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు రావడం, వెస్ట్ ఏషియాలో అనిశ్చితే ఇందుకు కారణాలు. నిఫ్టీ 24,641 (-35), సెన్సెక్స్ 81,573 (-140) వద్ద ట్రేడవుతున్నాయి. రియాల్టి, కన్జూమర్ డ్యురబుల్స్ షేర్లకు డిమాండ్ కనిపిస్తోంది. FMCG, మీడియా, ఫార్మా షేర్లపై సెల్లింగ్ ప్రెజర్ నెలకొంది. LT, SBI LIFE, KOTAK BANK, TECH M టాప్ గెయినర్స్ ..FMCG షేర్లు టాప్.. లూజర్స్.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..