విజయవాడ, 17 ఫిబ్రవరి (హి.స.)అమెరికాలో అతి పెద్ద బ్యాంక్ అయిన జేపీ మోర్గాన్‌లో హైబ్రిడ్ పని చాలా వరకు ముగిసింది. మార్చి నుంచి కార్మికులందరినీ కార్యాలయానికి తిరిగి రావాలని బ్యాంక్ ఆపరేటింగ్ కమిటీ ఆదేశాలు జారీ చేసింది. అయితే, చాలా మంది ఉద్యోగులు బ్యాక్ టూ ఆఫీస్ అనే రూల్ పై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయంతో తమ పని-జీవిత సమతుల్యతకు ప్రతికూలంగా ప్రభావితం చేసిందని పేర్కొన్నారు. దీని వల్ల సీనియర్ ఉద్యోగులు, మహిళలు, అంగ వైకల్యాం ఉన్న వ్యక్తులను తీవ్రంగా ప్రభావితం చేసిందన్నారు. ఐదు రోజుల పాటు ఆఫీసుకి రావాలనే పని విధానాన్ని వ్యతిరేకిస్తూ 1,200 కంటే ఎక్కువ మంది ఉద్యోగులు అంతర్గత పిటిషన్ పై సంతకాలు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల