ఘనంగా జరిగిన భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి పట్టాభిషేక మహోత్సవం.. పట్టు వస్త్రాలను సమర్పించిన గవర్నర్ రాధాకృష్ణ
భద్రాచలం ఏప్రిల్ 18 (హిం.స) భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి మహా పట్టాభిషేకం మహోత్సవం ఘనంగా జర
ఘనంగా జరిగిన భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి పట్టాభిషేక మహోత్సవం.. పట్టు వస్త్రాలను సమర్పించిన గవర్నర్ రాధాకృష్ణ


భద్రాచలం ఏప్రిల్ 18 (హిం.స)

భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి మహా పట్టాభిషేకం మహోత్సవం ఘనంగా జరిగింది. శ్రీరామ నామస్మరణల మధ్య ప్రధానాలయంలో ప్రత్యేక పూజలు అందుకున్న స్వామివారి కల్యాణ మూర్తులను ఊరేగింపుగా యాగశాల వద్దకు తీసుకొచ్చారు. శ్రీరామాయణ మహాక్రతువులో భాగంగా సామూహిక పారాయణం చేశారు. స్వర్ణ సార్వభౌమ వాహనంపై దేవదేవుడు మిథిలా మండపానికి రావడంతో ఆ ప్రాంతమంతా శ్రీరామనామ స్మరణతో మారుమోగింది. మహా పట్టాభిషేక విశిష్టతను వైదిక పెద్దలు వివరించారు.

రాములవారి పట్టాభిషేక మహోత్సవానికి హాజరైన గవర్నర్ రాధాకృష్ణన్ తెలంగాణ ప్రభుత్వం తరఫున స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు.

దక్షిణ అయోధ్య భద్రాచలం సీతారామచంద్రస్వామి వారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని గవర్నర్ అన్నారు.

శ్రీ సీతారాముల సేవలో తరించడం తన అదృష్టమన్నారు. ప్రజలకు సుభిక్షమైన పాలన అందించడం, సుఖసంతోషాలతో ఉండేలా చూడటమే రామరాజ్య స్థాపన ఉద్దేశమని చెప్పారు. కాగా, అంతకు ముందు గవర్నర్ ప్రధాన ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు పూజల అనంతరం అర్చకులు ఆయనకు వేదాశీర్వచనాలిచ్చి తీర్థప్రసాదాలు, జ్ఞాపికను అందించారు. ఆ తర్వాత గవర్నర్ మిథిలా మండపానికి చేరుకుని మహాపట్టాభిషేక కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంపత్ రావు హిందుస్థాన్ సమాచారం


 rajesh pande