లాభాలతో ప్రారంభమై నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్
ముంబయి: ఏప్రిల్ 18 (హిం.స) దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా నాలుగో రోజూ నష్టాల్లో ముగిశాయి. ఉద
లాభాలతో ప్రారంభమై నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్


ముంబయి: ఏప్రిల్ 18 (హిం.స)

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా నాలుగో రోజూ నష్టాల్లో ముగిశాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన సూచీలు.. అమ్మకాల ఒత్తిడితో సాయంత్రానికి నష్టాల్లోకి జారుకున్నాయి. అమెరికా వడ్డీ రేట్ల కోతపై ఆశలు క్షీణించడం, మధ్యప్రాశ్చంలో ఘర్షణ వాతావరణం వంటి కారణాలు సూచీలను పడేశాయి.

ఉదయం సెన్సెక్స్ 73,183.10 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. ఉదయం లాభాల్లోనే కొనసాగింది. ఇంట్రాడేలో 73,473.05 వద్ద గరిష్ఠాన్ని తాకిన సూచీ.. గరిష్ఠాల వద్ద లాభాల స్వీకరణతో ఒక్కసారిగా పతనమైంది. ఇంట్రాడేలో గరిష్ఠాల నుంచి దాదాపు వెయ్యి పాయింట్ల మేర క్షీణించింది. చివరికి 454.69 పాయింట్ల నష్టంతో 72,488.99 వద్ద ముగిసింది. నిఫ్టీ 2 152. 05 పాయింట్ల నష్టంతో 21,995 పాయింట్ల వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.55గా ఉంది.

రంజిత్ కుమార్ హిందుస్థాన్ సమాచారం


 rajesh pande