బీఆర్ఎస్ కు మరో దెబ్బ.. కారు దిగి కాంగ్రెస్లోకి రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్
హైదరాబాద్ ఏప్రిల్ 19 (హిం.స) అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీకి వరుస ఎదురుదెబ్బ
బీఆర్ఎస్ కు మరో దెబ్బ.. కారు దిగి కాంగ్రెస్లోకి రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్


హైదరాబాద్ ఏప్రిల్ 19 (హిం.స)

అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. లోకసభ ఎన్నికల ముందు నేతలు ఒక్కొకరుగా పార్టీని వీడుతున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీలు ఇలా అందరూ బీఆర్ఎస్కు గుడ్బై చెబుతున్నారు. తాజాగా మరో సిట్టింగ్ ఎమ్మెల్యే కారు దిగేందుకు రెడీ అయ్యారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమయ్యారు.

ఈ మేరకు ఎమ్మెల్యే శుక్రవారం సీఎం రేవంత్రెడ్డిని కలిశారు. త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు సీఎంకు తెలియజేశారు. తన అనుచరులతో కలిసి, సీఎం సమక్షంలో ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. కాగా ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు కాంగ్రెస్లో చేరిన సంగతి తెలిసిందే. వీరితోపాటు అనేకమంది ఎంపీలు, ముఖ్య నేతలు సైతం బీఆర్ఎస్ను వీడారు.

సంపత్ రావు హిందుస్థాన్ సమాచారం


 rajesh pande