రాష్ట్రంలో 14 సీట్లు గెలుచుకోవడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్
హైదరాబాద్ ఏప్రిల్ 19 (హిం.స) లోక్సభ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో పార్టీ ప్రచారాన్ని ముమ్
రాష్ట్రంలో 14 సీట్లు గెలుచుకోవడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్


హైదరాబాద్ ఏప్రిల్ 19 (హిం.స)

లోక్సభ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో పార్టీ ప్రచారాన్ని ముమ్మరం చేయడంపై ముఖ్యమంత్రి, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. 14 సీట్లు గెలుచుకోవడమే లక్ష్యమని చెబుతున్న సీఎం అందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. లక్ష్యం మేరకు సీట్లను గెలుచుకోవడం ద్వారా పార్టీలో తన ప్రాబల్యం నిరూపించుకోవాలనే పట్టుదలతో ఆయన ఉన్నట్లు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో ప్రచార పర్వాన్ని మూడు విడతలుగా చేపట్టాలని భావిస్తున్నట్లు పార్టీ వర్గాలద్వారా తెలుస్తోంది. రాష్ట్రంలోని 17 పార్లమెంటు సీట్లకు గాను మూడు దఫాల్లో 14 ప్రాంతాల్లో రేవంత్ రెడ్డి పర్యటించేలా ప్రణాళిక రూపొందించినట్లు తెలిసింది. మధ్యలో జాతీయ నాయకులతో కూడా ప్రచారం చేయించే ఆలోచనతో ఉన్నారు. రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న కేరళలోని వయనాడ్ నియోజకవర్గంలో రెండురోజుల పర్యటన ముగించుకొని హైదరాబాద్ చేరుకున్న రేవంత్రెడ్డి శుక్రవారం నుంచే తన కార్యాచరణ మొదలెట్టారు. వీలైనంత మేరకు పార్టీ అభ్యర్థుల నామినేషన్ల కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపాలని భావిస్తున్నారు.తన సొంత జిల్లా మహబూబ్నగర్ పార్లమెంటు

స్థానంలో పార్టీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి విజయాన్ని రేవంత్రెడ్డి ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 14 మంది ఎమ్మెల్యేలకు 12 మంది కాంగ్రెస్ వారే ఉండడం, బీజేపీకి చెందిన మాజీ ఎంపీ జితేందర్ రెడ్డితో పాటు పార్లమెంటు పరిధిలోని బీఆర్ఎస్ నాయకులు పలువురు కాంగ్రెస్లో చేరిన నేపథ్యంలో భారీ మెజారిటీతో ఈ స్థానాన్ని దక్కించుకునేలా వ్యూహరచన చేస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం వంశీచంద్ రెడ్డి నామినేషన్ దాఖలు చేసే కార్యక్రమానికి ఆయన హాజరు కానున్నారు. కాగా సాయంత్రం మహబూబాబాద్లో జరిగేబహిరంగసభలో సీఎం పాల్గొననున్నారు.

మహబూబాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ కూడా నామినేషన్ వేయనున్నారు.

సంపత్ రావు హిందుస్థాన్ సమాచారం


 rajesh pande