తాను హై టెన్షన్ వైరు లాంటి వాడిని, ముట్టుకుంటే షాక్ కొడుతుంది.. రేవంత్ రెడ్డి
మహబూబ్నగర్: ఏప్రిల్ 19 (హిం.స) కేసీఆర్ వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. రేవంత్ను ముట్
తాను హై టెన్షన్ వైరు లాంటి వాడిని, ముట్టుకుంటే షాక్ కొడుతుంది.. రేవంత్ రెడ్డి


మహబూబ్నగర్: ఏప్రిల్ 19 (హిం.స)

కేసీఆర్ వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. రేవంత్ను ముట్టుకుంటే షాక్ కొడుతుందని, తాను హైటెన్షన్ వైర్ లాంటివాడినని చెప్పారు. కేసీఆర్ కథలకు కాలం చెల్లిందన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కాపాడుకునే శక్తి తనకు ఉందన్నారు.

మహబూబ్నగర్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీ చంద్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో సీఎం రేవంత్రెడ్డితోపాటు పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెట్టుగడ్డ చౌరస్తా నుంచి క్లాక్ టవర్ చౌరస్తా వరకు రోడ్ షో నిర్వహించారు. పార్లమెంటులో నోరు లేకపోయినా, పాలమూరులో 2009 లోక సభ ఎన్నికల్లో కేసీఆర్ను పాలమూరు ప్రజలు గెలిపించారని గుర్తు చేశారు. అయినా కేసీఆర్ పాలమూరు జిల్లాకు ఏం చేయలేకపోయారని విమర్శించారు.

కృష్ణానది పక్కనే ప్రవహిస్తున్న పాలమూరులో ప్రాజెక్టులు కట్టలేదని, విద్యా, ఉద్యోగ అవకా సహకరించలేదని దుయ్యబట్టారు. పరిశ్రమలు కూడా కట్టలేదని మండిపడ్డారు. ఎంపీ శ్రీనివాస్ రెడ్డి పార్లమెంట్లో ఏరోజు పాలమూరు గురించి మాట్లాడలేదని విమర్శించారు. మళ్లీ ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు.

సంపత్ రావు హిందుస్తాన్ సమాచార్.


 rajesh pande