ఐపీఎల్ నేడు మరో ఇంట్రెస్టింగ్ ఫైట్..
తెలంగాణ క్రీడలు ఏప్రిల్ 19 (హిం.స) ఐపీఎల్లో మరో ఇంట్రెస్టింగ్ ఫైట్ నేడు జరుగనుంది. లక్నో సూపర్ జెయిం
ఐపీఎల్ నేడు మరో ఇంట్రెస్టింగ్ ఫైట్..


తెలంగాణ క్రీడలు ఏప్రిల్ 19 (హిం.స)

ఐపీఎల్లో మరో ఇంట్రెస్టింగ్ ఫైట్ నేడు జరుగనుంది. లక్నో సూపర్ జెయింట్స్.. ఫైవ్ టైమ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ను ఢీకొట్టనుంది. లక్నో హోం గ్రౌండ్ అయిన భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగనుంది. ఈ సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఇంచుమించు ఒకటే తరహా ప్రదర్శనలతో ముందుకు పోతున్నాయి.

లక్నోతో పోలిస్తే సీఎస్కే ఓ అడుగు ముందుంది. సీఎస్ కే ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్ల్లో 4 విజయాలు సాధించగా.. లక్నో ఆరింట మూడు మ్యాచ్లో గెలుపొందింది. ప్రస్తుతం సీఎస్కే మూడు, లక్నో ఐదు స్థానాల్లో కొనసాగుతున్నాయి.

హెడ్ టు హెడ్ రికార్డులను పరిశీలిస్తే.. ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు రెండు మ్యాచ్ జరుగగా చెరో మ్యాచ్లో విజయం సాధించాయి. బలాబలాల విషయానికొస్తే.. లక్నోతో పోలిస్తే చెన్నై అన్ని విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తుంది. సీఎస్కేలో అందరు ఆటగాళ్లు తలో చేయి వేస్తూ జట్టు విజయాలకు దోహదపడుతున్నారు. లక్నో విషయంలో టీమ్ వర్క్ కొరవడింది.

రంజిత్ కుమార్ హిందుస్థాన్ సమాచార్


 rajesh pande