దేశవ్యాప్తంగా ప్రశాంతంగా కొనసాగుతున్న మొదటి దశ పోలింగ్.. ఉదయం ఆరున్నరకే పోలింగ్ కేంద్రానికి చేరుకున్న మేఘాలయ ముఖ్యమంత్రి సంగ్మా..
న్యూఢిల్లీ ఏప్రిల్ 19 (హిం.స) నేడు జరుగుతున్న మొదటి దశ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఉదయం ప్రశాంతంగా ప్
దేశవ్యాప్తంగా ప్రశాంతంగా కొనసాగుతున్న మొదటి దశ పోలింగ్.. ఉదయం ఆరున్నరకే పోలింగ్ కేంద్రానికి చేరుకున్న మేఘాలయ ముఖ్యమంత్రి సంగ్మా..


న్యూఢిల్లీ ఏప్రిల్ 19 (హిం.స) నేడు జరుగుతున్న మొదటి దశ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఉదయం ప్రశాంతంగా ప్రారంభమైంది. సాధారణ పౌరులతోపాటు ప్రముఖులు కూడా ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాల వద్దకు తరలివెళ్తున్నారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాకముందే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద భారీ సంఖ్యలో క్యూ కట్టారు. మేఘాలయ ముఖ్యమంత్రి కాన్నాడ్ కే సంగ్మా

సైతం లోక్సభ ఎన్నికల తొలి విడతలో ఓటు వేసేందుకు ఉదయం 6:30 గంటలకే తురాలోని పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. ముందుగా తాను ఓటు వేయాలని భావించి వచ్చినట్లు చెప్పారు. అయితే, తన కంటే ప్రజలే ముందు వెళ్లి క్యూలో నిలబడటం తనని ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. ‘నేను ముందుగా ఓటు వేయాలని భావించి ఉదయం 6:30 గంటలకే పోలింగ్ కేంద్రానికి రావడం జరిగింది.

అయితే, ప్రజలు అప్పటికే క్యూలైన్లో ఉండటం చూసి ఆయన ఒక్కసారిగా షాక్ అయ్యారు.కేంద్రానికి చేరుకున్నా. కానీ, నా కంటే ముందు చాలా మంది ఉండటం నన్ను ఆశ్చర్యపరిచింది. ఇది మంచి ధోరణి. ఓటు వేయడం ప్రతి పౌరుడి హక్కు. ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి ఓటు వేసి తమ ప్రజాస్వామ్య హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా'' అని ఆయన అన్నారు.

కాగా, సార్వత్రిక ఎన్నికలు మొత్తం ఏడు విడతల్లో జరగనున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మొత్తం 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 102 స్థానాలకు ఇవాళ తొలి విడత పోలింగ్ జరుగుతోంది. మొదటి దశలో 102 స్థానాలకు గానూ మేఘాలయాలో రెండు లోక్సభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. అందులో తురా, షిల్లాంగ్ స్థానాలు ఉన్నాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 6 గంటల వరకూ కొనసాగనుంది.

ఇక తొలి విడత ఎన్నికల్లో మొత్తం 1,625 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో 1491 మందిపురుషులు కాగా, 134 మంది మహిళా అభ్యర్థులు.

మొత్తం 16.63 కోట్ల మంది ఓటర్లు వీరి భవితవ్యాన్ని తేల్చనున్నారు. జూన్ 4న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఇక అదే రోజు ఫలితాలు వెల్లడికానున్నాయి.

సంపత్ రావు హిందుస్థాన్ సమాచారం


 rajesh pande