కమిషన్ నియమ నిబంధనల మేరకు పనిచేయాలి...ఎన్నికల వ్యయ పరిశీలకులు సెంథిల్ కుమారన్,
హైదరాబాద్19,,ఏప్రిల్ (హిం.స) పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ జిల్లాలో ఏర్పాట్లు,వివిధ కమిటీల పని తీరుపై
కమిషన్ నియమ నిబంధనల మేరకు పనిచేయాలి...ఎన్నికల వ్యయ పరిశీలకులు సెంథిల్ కుమారన్,


హైదరాబాద్19,,ఏప్రిల్ (హిం.స) పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ జిల్లాలో ఏర్పాట్లు,వివిధ కమిటీల పని తీరుపై సంతృప్తిని వ్యక్తం చేసిన వ్యయ పరిశీలకులు భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ఆయా నోడల్ అధికారులు ఎన్నికలకు సంబంధించిన విధులను నిర్వర్తించాలని వ్యయ పరిశీలకులు సెంథిల్ కుమారన్,అమిత్ శుక్లా లు సూచించారు.

కేంద్ర ఎన్నికల కమిషన్ నియమించిన , జిల్లాకు చేరుకున్న వ్యయ పరిశీలకులు శుక్రవారం జిల్లా ఎన్నికల అధికారి ,జి హెచ్ ఎం సి కమిషనర్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వారు జిల్లా ఎన్నికల అధికారి, సీపీ,రిటర్నింగ్ అధికారులు,ఆయా నోడల్ అధికారులు, ఆయా శాఖల ఎన్ఫోర్స్మెంట్ నోడల్ అధికారులు లతో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకే అధికారు లందరూ నడుచుకోవాలన్నారు.ఆయా అధికారులందరూ తమ తమ విధులను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు.

జిల్లాలో ఎన్నికల నిర్వహణలో భాగంగా చేసిన ఏర్పాట్లు,వివిధ కమిటీల పని తీరుపై సంతృప్తి వ్యక్తం చేసారు.అంతకు ముందు జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ పి పి టి ద్వారా జిల్లా ప్రొఫైల్,జనాభా, ఓటర్ల సంఖ్య, పోలింగ్ బూత్ లు, ఏర్పాటు చేసిన వివిధ ఎన్ఫోర్స్మెంట్ బృందాలు, ఎన్నికల నిర్వహణకు ఏర్పాటు చేసిన నోడల్ అధికారుల వివరాలు,ఆయా కమిటీలు చేస్తున్న పనులు,జిల్లాలో ఇప్పటి వరకు పట్టుకున్న నగదు, ఇతర వస్తువులు,లిక్కర్ వివరాలు,జిల్లా గ్రీవెన్స్ కమిటీ ద్వారా రిలీజ్ చేసిన నగదు వివరాలు, సువిద అనుమతులు,సి విజిల్ లో వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించిన వివరాలు, కార్యక్రమాలు,అందుబాటులో వున్న పోలింగ్ సిబ్బంది ,ఇచ్చిన శిక్షణలు, తదితరాలను అబ్జర్వర్స్ కు వివరించారు.

అడిషనల్ సిపి విక్రమ్ సింగ్ మాన్ పోలీస్ శాఖ ద్వారా చేస్తున్న ఆయా పనులు,ఏర్పాట్లను వివరించారు.

ఈ సమావేశంలో సిపి శ్రీనివాస్ రెడ్డి, సికింద్రాబాద్ రిటర్నింగ్ అధికారి హేమంత్ కేశవ్ పాటిల్,సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ రిటర్నింగ్ అధికారి మధుకర్ నాయక్,

ఈ వి డి ఎం డైరెక్టర్ ప్రకాష్ రెడ్డి,ఎన్నికల ఆడిషనల్ కమిషనర్ అలివేలు మంగ తయారు, ఆయా ఎన్ఫోర్స్మెంట్ నోడల్ అధికారులు, కేంద్ర ,రాష్ట్ర కమర్షియల్ టాక్స్,ఎక్సైజ్,ఎయిర్ పోర్ట్,నార్కోటిక్ ,రవాణా జి యస్ టి ఇన్కమ్ టాక్స్, స్టేట్ బ్యాంకర్స్

ఆయా నోడల్ అధికారులు ఎన్నికల నోటిఫికేషన్ తరువాత చేపట్టిన ఎన్ఫోర్స్మెంట్ చర్యలు, నగదు , వస్తువులు తదితర అంశాల పై ఎన్నికల వ్యయ పరిశీలకులకు వివరించారు..

ఈ సందర్భంగా కమాండ్ కంట్రోల్ రూం లో యస్ యస్ టి యాప్ యస్ టి చెక్ పోస్ట్లు వద్ద ఏర్పాటు చేసిన సి సి కెమెరాల ను పరిశీలించారు.

హిందుస్థాన్ సమాచార నాగరాజ్


 rajesh pande