చంద్రాబునాయుడు ప్రభుత్వం సాగునీటికి ప్రాధాన్యత
, 10 జూలై (హి.స.) విజయవాడ,: నీరు లేకపోతే ప్రాణం నిలవదని ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. త్రాగునీటిని నిర్లక్ష్యం చేసింది మాజీ సీఎం జగన్ విమర్శలు గుప్పించారు. కొత్త ఆయకట్టుకు కూడా సాగు నీరు ఇచ్చి రాష్ట్రాన్ని ర
చంద్రాబునాయుడు ప్రభుత్వం సాగునీటికి ప్రాధాన్యత


, 10 జూలై (హి.స.)

విజయవాడ,: నీరు లేకపోతే ప్రాణం నిలవదని ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. త్రాగునీటిని నిర్లక్ష్యం చేసింది మాజీ సీఎం జగన్ విమర్శలు గుప్పించారు. కొత్త ఆయకట్టుకు కూడా సాగు నీరు ఇచ్చి రాష్ట్రాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. జగన్ పాలనతో ఇరిగేషన్‌ను 20 ఏళ్ళ వెనక్కు నెట్టేసారని వ్యాఖ్యలు చేశారు.

ఏపీ విభజన వల్ల వచ్చిన నష్టం కంటే జగన్ పాలన వల్ల ఇరిగేషన్ వచ్చిన నష్టం ఎక్కువన్నారు. సాగునీటికి చంద్రబాబు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు. పట్టిసీమ లిఫ్ట్ నుంచి వచ్చిన నీళ్ళు ఇప్పుడు కృష్ణా డెల్టాలో దాహార్తి తీరుస్తున్నాయన్నారు. వైసీపీ నేతలు కళ్ళు తెరుచుకుని ఇదంతా చూడాలిని అన్నారు. ఇసుక మీద 40 వేల కోట్లు ఎలా కొట్టేయచ్చు, భూములు మైన్స్ ఎలా లోబరుచుకోవచ్చు అనే దానిపైనే వైసీపీ దృష్టి పెట్టిందని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.

ముగింపు

హిందూస్తాన్ సమచార్ / నిత్తల / నాగరాజ్ రావు


 rajesh pande