సుమారు 6 లక్షల విలువైన నిషేధిత గుట్కా బ్యాగులను స్వాధీనం చేసుకున్న మంచిర్యాల పోలీసులు
గుట్కా బ్యాగులు


Telangana, మంచిర్యాల.10 జూలై (హి.స.)

నిషేధిత గుట్కా బ్యాగులను అక్రమంగా

తరలిస్తున్న ఇద్దరిని పోలసులు అదుపులోకి తీసుకున్న ఘటన మంచిర్యాల జిల్లా దండేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. చెలుకగూడెం గ్రామ శివారులో పోలీసులు వాహనాల తనిఖీ చేస్తుండగా జన్నారం వైపు నుంచి వస్తున్న అశోక లీలాండ్ వ్యాన్పై అనుమానం వచ్చి ఆపి తనిఖీ చేశారు. అయితే, సంచుల్లో ప్రభుత్వం నిషేధించిన పొగాకు అంబర్ బ్యాగులు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో వాహనంలో ఉన్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. నిషేధిత పొగాకు అంబర్ సంచులను పోలీస్ స్టేషన్కు తరలించి వారిపై కేసు నమోదు చేశారు. పట్టుబడిన నిషేధిత గుట్కా విలువ సుమారు రూ.6 లక్షల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు.

రంజిత్ కుమార్ హిందుస్థాన్ సమాచార్

హిందూస్తాన్ సమచార్ / Bachu Ranjith Kumar / నాగరాజ్ రావు


 rajesh pande