విద్యార్థులు ఇష్టపడి చదివి లక్ష్యాన్ని చేరుకోవాలి.. నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్
Telangana, నారాయణపేట. 10 జూలై (హి.స.) విద్యార్థులు ఇష్టపడి చదివి లక్ష్యాన్ని చేరుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. బుధవారం నారాయణపేట మండలం జాజాపూర్ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు
నారాయణపేట జిల్లా కలెక్టర్


Telangana, నారాయణపేట. 10 జూలై (హి.స.)

విద్యార్థులు ఇష్టపడి చదివి లక్ష్యాన్ని చేరుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. బుధవారం నారాయణపేట మండలం జాజాపూర్ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల హాజరు రిజిస్టరు తనిఖీ చేశారు. అలాగే విద్యార్థుల హాజరు, బోధన, మధ్యాహ్న భోజనం తదితర అంశాలపై తనిఖీ చేశారు. 9 వ తరగతి విద్యార్థులకు ఉపాధ్యాయురాలుగా మారి బోర్డు పై రాసి విద్యా బోధన చేశారు. అనంతరం విద్యార్థులను ప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... ఎస్ఎస్సి లో ఎంత మంది విద్యార్థులు ఉన్నారని అడిగారు. గత సంవత్సరం ఎస్ఎస్సి ఫలితాలు ఎంత వచ్చాయని అడగగా 84% ఉత్తీర్ణులయ్యారని హెడ్మాస్టర్ కలెక్టర్ కు తెలిపారు.

హిందూస్తాన్ సమచార్ / Bachu Ranjith Kumar / నాగరాజ్ రావు


 rajesh pande