అమెరికా రాజకీయాలలో కీలక పరిణామం.. అధ్యక్ష ఎన్నికల బరి నుండి తప్పుకున్న జో బైడన్
అమెరికా జూలై 22 హి.స అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి జో బైడెన్ తప్పుకున్నారు. తరుచూ తన మతిమరుపుతో తడబడటం, గత నెల ట్రంప్తో జరిగిన డిబేట్లో ఘోర వైఫల్యం వంటి కారణాలతో సొంత పార్టీ నేతల నుంచి బైడెన్ తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నారు. డెమొక్రాటిక్ అభ్యర్థ
అమెరికా అధ్యక్షుడు జో బెయిడెన్


అమెరికా జూలై 22 హి.స

అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి జో బైడెన్ తప్పుకున్నారు. తరుచూ తన మతిమరుపుతో తడబడటం, గత నెల ట్రంప్తో జరిగిన డిబేట్లో ఘోర వైఫల్యం వంటి కారణాలతో సొంత పార్టీ నేతల నుంచి బైడెన్ తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నారు. డెమొక్రాటిక్ అభ్యర్థిత్వం నుంచి

తప్పుకోవాలని ఆ పార్టీ నేతలు బాహటంగా డిమాండ్ చేశారు. మాజీ అధ్యక్షు బరాక్ ఒబామా తన సన్నిహితులతో ఇదే అభిప్రాయం వ్యక్తం చేసినట్టు కథనాలు వెలువడ్డాయి. అలాగే, మాజీ

హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ ఏకంగా బైడెన్కు ఫోన్ చేసి.. పోటీ నుంచి వైదొలగాలని చెప్పడం తీవ్ర

చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో జో బైడెన్ తప్పనిసరి పరిస్థితుల్లో వైదొలగాల్సి వచ్చింది. పార్టీ,అమెరికా ప్రయోజనాల దృష్ట్యా

తాను పోటీ నుంచి వైదొలగుతున్నట్లు బైడెన్ ప్రకటించారు.బైడెన్ తప్పుకోవడంతో

ఎన్నికలకు ఇంకా 3 నెలలే సమయం ఉండటం వల్ల డెమొక్రాట్ల తరఫున ఎవరు పోటీచేస్తారనే ఆసక్తి నెలకుంది. అయితే, బైడెన్ మాత్రం ప్రస్తుతం

ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్కు తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఆమె అభ్యర్థిత్వాన్ని ఆమోదిస్తున్నట్టు తెలిపిన ఆయన.. డెమొక్రాట్లు

ఐక్యంగా ట్రంప్ను ఓడించాలని పిలుపునిచ్చారు.ఇక, డెమొక్రాట్ పార్టీ నేతల్లో ఎక్కువ మంది భారత

సంతతికి చెందిన కమలావైపే మొగ్గు

చూపుతున్నట్లు సమాచారం. పలు సర్వేల్లోనూ ట్రంప్ను ఓడించే సత్తా కమలాకు ఉందని వెల్లడయ్యింది.ఎన్నికలకు సమయం తక్కువే ఉన్నందున ట్రంప్ను ఎదుర్కొవాలంటే ఆమే సరైన అభ్యర్ధి అనేది వారి అంచనా. కానీ, కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్, ఇల్లినాయిస్ గవర్నర్ జేబీ ఫ్రిట్జ్కెర్ కూడా అభ్యర్థిత్వం రేసులో ఉన్నారు. మిచిగన్ గవర్నర్ విట్మర్ పేరు తెరపైకి వచ్చినా ఆమె మాత్రం తాను పోటీచేయనని ప్రకటించారు. దీంతో కమలా హ్యారిస్, గవిన్ న్యూసమ్, జేబీ ఫ్రిట్జ్కర్ మధ్య పోటీ నెలకుంది. ఆగస్టు 19 నుంచి 22 మధ్య షికాగోలో జరిగే డెమొక్రాటిక్ పార్టీ సమావేశంలో అభ్యర్థిని ఎన్నుకుంటారు.81 ఏళ్ల బైడెన్ వయసు రీత్యా పలు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇటీవల పలు వేదికలపై తడబాట్లతో నవ్వులపాలయ్యారు. అలాగే, జూన్ 27న ట్రంప్తో జరిగిన ఎన్నికల డిబేట్లోనూ ఆయన ఘోరంగా విఫలమయ్యారు. ప్రస్తుతం కోవిడ్-19 బారినపడి జో బైడెన్.. డేలావేర్లో తన ఇంటి వద్ద చికిత్స తీసుకుంటూ ఐసొలేషన్లో ఉన్నారు. ఇటీవల జరిగిన ప్రైమరీల్లో 95శాతం డెమొక్రాట్ ప్రతినిధులు ఆయన మద్దతు పలికారు. అనూహ్యంగా జో వైదొలగడంతో వారంతా మరో అభ్యర్థిని ఎన్నుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్ / నాగరాజ్ రావు


 rajesh pande