టేకాఫ్ అవుతుండగా కూలిన విమానం: 18 మంది మృతి
కాఠ్‌మాండూ:, 24 జూలై (హి.స.) నేపాల్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. రాజధాని నగరం కాఠ్‌మాండూలోని త్రిభువన్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. శౌర్య ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో ప్రమాదవశాత్తూ కూలిపోయింది. దాంత
టేకాఫ్ అవుతుండగా కూలిన విమానం: 18 మంది మృతి


కాఠ్‌మాండూ:, 24 జూలై (హి.స.) నేపాల్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. రాజధాని నగరం కాఠ్‌మాండూలోని త్రిభువన్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. శౌర్య ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో ప్రమాదవశాత్తూ కూలిపోయింది. దాంతో మంటలు చెలరేగి విమానం దగ్ధమైంది. దాని నుంచి పొగలు వస్తున్న దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి.

ఈ ప్రమాద సమయంలో విమానంలో సిబ్బందితో సహా 19 మంది ఉన్నారు. ఈ ఘటనలో 18 మంది మృతిచెందగా.. పైలట్‌ తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే సహాయక సిబ్బంది రంగంలోకి దిగారు. గాయపడిన పైలట్‌ను విమానం నుంచి బయటకు తీసి, ఆసుపత్రికి తరలించారు.

హిందూస్తాన్ సమచార్

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande