మెగాస్టార్ చిరంజీవి బర్త్డే సందర్భంగా మెగా ఫ్యాన్స్ కి వైజయంతి మూవీస్ సర్ప్రైజ్..
వినోదం, జూలై 24 హిం.స: మెగాస్టార్ చిరంజీవి ప్రజెంట్ 'విశ్వంభర' మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. వశిష్ట దర్శకత్వం వహిస్తుండగా.. యూవి క్రియోషన్స్ బ్యానర్పై వంశీ కృష్ణా రెడ్డి ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇందులో త్రిష అ
మెగాస్టార్ చిరంజీవి


వినోదం, జూలై 24 హిం.స:

మెగాస్టార్ చిరంజీవి ప్రజెంట్ 'విశ్వంభర' మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. వశిష్ట దర్శకత్వం వహిస్తుండగా.. యూవి క్రియోషన్స్ బ్యానర్పై వంశీ కృష్ణా రెడ్డి ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇందులో త్రిష అషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే తొందరలోనే ఈ మూవీ విడుదల కాబోతుంది.

ఈ క్రమంలో.. మెగా ఫ్యాన్స్కు బిగ్ సర్ప్రైజ్ ఇస్తూ వైజయంతీ మూవీస్ బ్యానర్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా బ్లాక్ బస్టర్ హిట్ 'ఇంద్ర' సినిమాను చేయబోతున్నట్లు వెల్లడించారు. ఈ మూవీకి ప్రత్యేక స్థానం ఉందన్న విషయం తెలిసిందే. గోపాల్ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో వీపరీతంగా ప్రేక్షకుల ఆకట్టుకుంది.

జూలై 24, 2002లో రిలీజ్ అయిన నేటితో 22 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మేకర్స్ రీరిలీజ్పై అప్డేట్ ఇచ్చారు. చిరంజీవి పుట్టినరోజు ఆగస్టు 22న రాబోతుండటంతో.. ఫ్యాన్స్కు అదిరిపోయే గుడ్ న్యూస్ తెలిపారు. ఇక ఈ విషయం తెలిసిన మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అంతేకాకుండా.. ఇంద్ర మరోసారి బాక్సాఫీసు వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని అంటున్నారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్.. / నాగరాజ్ రావు


 rajesh pande