భద్రాద్రి కొత్తగూడెం, 27 జూలై (హి.స.)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో దారుణం చోటుచేసుకుంది. తల్లిని కిరాతకంగా కొట్టి హత్య చేసి అనంతరం తనయుడు ఉరేసుకున్న ఘటన శనివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం బూడిద గడ్డ ఏరియాలో నివాసం ఉంటున్న తల్లి తుల్జా కుమారిని కుమారుడు వినయ్ కుమార్ కిరాతకంగా హత్యగావించి అనంతరం ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. విషయం తెలుసుకున్న డీఎస్పీ రెహమాన్, త్రీ టౌన్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ కొనసాగి కొనసాగిస్తున్నారు.
హిందూస్తాన్ సమచార్
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్ / నాగరాజ్ రావు