హర్యానాలో బోల్తాబడిన స్కూల్ బస్సు.. 40 మందికి పైగా విద్యార్థులకు గాయాలు
స్కూల్ బస్సు ప్రమాదం


హర్యానా 8 జూలై (హి.స.)

హర్యానాలోని పంచకులలో స్కూలు

బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 40 మందికిపైగా స్కూల్ విద్యార్థులు గాయపడ్డారు. పింజోర్ లోని నౌల్టా

గ్రామ సమీపంలో ఈ యాక్సిడెంట్ జరిగింది. హర్యానా రోడ్ వేస్ కు చెందిన బస్సు బోల్తా పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. అతివేగంతో వెళ్లడం వల్లే డ్రైవర్ నియంత్రణ కోల్పోయినట్లు భావిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో దాదాపు 70 మంది విద్యార్థులు

ఉన్నారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. బస్సు ఓవర్లోడ్, రోడ్ల అధ్వాన్న స్థితి కూడా ప్రమాదానికి దారితీయొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

గాయపడిన వారిని పంచకులలోని పింజోర్ ఆసుపత్రి, సెక్టార్ సివిల్ ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలైన

వారిని పీజీఐ చండీగఢ్ కు తరలించారు.

హిందూస్తాన్ సమచార్ / Bachu Ranjith Kumar


 rajesh pande