కన్వీనర్‌ కోటా కింద 81,490 మందికి బీటెక్‌ సీట్లు దక్కాయి. మొత్తం సీట్లలో 94.20 శాతం భర్తీ అ
హైదరాబాద్, 1 ఆగస్టు (హి.స.)రాష్ట్రంలో ఇంజినీరింగ్‌ రెండో విడత సీట్ల కేటాయింపుతో కలిపి మొత్తం కన్వీనర్‌ కోటా కింద 81,490 మందికి బీటెక్‌ సీట్లు దక్కాయి. మొత్తం సీట్లలో 94.20 శాతం భర్తీ అయ్యాయి. ఇంకా 5,019 సీట్లు మిగిలిపోయాయి. రెండో విడత కౌన్సెలింగ్‌ సీ
కన్వీనర్‌ కోటా కింద 81,490 మందికి బీటెక్‌ సీట్లు దక్కాయి. మొత్తం సీట్లలో 94.20 శాతం భర్తీ అ


హైదరాబాద్, 1 ఆగస్టు (హి.స.)రాష్ట్రంలో ఇంజినీరింగ్‌ రెండో విడత సీట్ల కేటాయింపుతో కలిపి మొత్తం కన్వీనర్‌ కోటా కింద 81,490 మందికి బీటెక్‌ సీట్లు దక్కాయి. మొత్తం సీట్లలో 94.20 శాతం భర్తీ అయ్యాయి. ఇంకా 5,019 సీట్లు మిగిలిపోయాయి. రెండో విడత కౌన్సెలింగ్‌ సీట్లను రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ అధికారులు బుధవారం కేటాయించారు. కొత్తగా 2,788 మందికి సీట్లు దక్కాయి. మొత్తం సీట్లలో 6,476 మంది ఈడబ్ల్యూఎస్‌ కోటాలో దక్కించుకున్నారు. పెద్ద ర్యాంకు రావడం.. తగినన్ని ఆప్షన్లు ఇవ్వకపోవడంతో 9,084 మందికి సీట్లు రాలేదు. ఏడు యూనివర్సిటీలు, 80 కళాశాలల్లో 100 శాతం సీట్లు భర్తీ కావడం విశేషం. తాజాగా సీట్లు పొందినవారు ఆగస్టు 2వ తేదీ లోపు ఫీజు చెల్లించి ఆన్‌లైన్‌లో సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయాలని ప్రవేశాల కమిటీ కన్వీనర్‌ శ్రీదేవసేన తెలిపారు. విద్యార్థులు మూడో విడతకు మెరుగైన సీట్లకు పోటీపడొచ్చని, మూడో విడత తర్వాత ఆగస్టు 16-17 తేదీల్లోనే విద్యార్థులు స్వయంగా కళాశాలలకు వెళ్లి అసలు టీసీతో పాటు ఇతర ధ్రువపత్రాల కాపీలను సమర్పించాలన్నారు. సీట్ల రద్దుకు ఆగస్టు 7వ తేదీ తుది గడువుగా తెలిపారు. సీఎస్‌ఈ, సంబంధిత బ్రాంచీల్లో 61,329 సీట్లుంటే 60,173 నిండాయి. అంటే 98.12 శాతం భర్తీ అయ్యాయి. ఇక ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్‌ సంబంధిత బ్రాంచీల్లో 16,573 సీట్లకు గాను 14,895 (89.88%), సివిల్, మెకానికల్‌ సంబంధిత బ్రాంచీల్లో 7,429కి 5,591 (75.26%) భర్తీ అయ్యాయి.

హిందూస్తాన్ సమచార్

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande