పారీస్ ఒలంపిక్స్ లో భారత్ ఖాతాలో మూడవ పతకం
తెలంగాణ, స్పోర్ట్స్, 1 ఆగస్టు (హి.స.) పారిస్ ఒలంపిక్స్లో భాగంగా భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. పురుషుల విభాగంలో 50 మీటర్ల రైఫిల్3 పొజిషన్లో షూటర్ స్వప్నిల్ కుసాలే కాంస్య పతకాన్ని సాధించాడు. తీవ్రమైన పోటీ ఉన్నప్పటికీ స్వప్నిల్ సత్తా చాటాడు. ఫైనల్లో
థర్డ్ మెడల్ ఇన్ ఒలింపిక్స్


తెలంగాణ, స్పోర్ట్స్, 1 ఆగస్టు (హి.స.)

పారిస్ ఒలంపిక్స్లో భాగంగా భారత్

ఖాతాలో మరో పతకం చేరింది. పురుషుల విభాగంలో 50 మీటర్ల రైఫిల్3 పొజిషన్లో షూటర్ స్వప్నిల్ కుసాలే కాంస్య పతకాన్ని సాధించాడు. తీవ్రమైన పోటీ ఉన్నప్పటికీ స్వప్నిల్ సత్తా చాటాడు. ఫైనల్లో 451.4 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి పతకం కైవసం చేసుకున్నారు. ఈ ఈవెంట్లో ఒలింపిక్ పతకం సాధించిన తొలి భారతీయ షూటర్గా నిలిచాడు. అలాగే ఇదే ఈవెంట్లో చైనాకు చెందిన లీ యుకున్ 463.6 పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచి స్వర్ణ పతకం గెలుచుకోగా.. ఉక్రెయిన్కు చెందిన కులిశ్ 461.3 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి రజతం సొంతం చేసుకున్నాడు. 50మీటర్ల 3 పొజిషన్ ఈవెంట్లో భారత్కు పతకం రావడం ఇదే తొలిసారి. దీంతో భారత్ సాధించిన పతకాల సంఖ్య మూడుకు చేరుకుంది. అయితే ఈ మూడు పతకాలు షూటింగ్లోనే రావడం గమనార్హం. అంతకుముందు 10మీటర్ల ఎయిర్ రైఫిల్ సింగిల్స్లో మనుబాకర్, 10 మీటర్ల రైఫిల్ మిక్స్డ్ మనూ బాకర్- సరబీజోత్ సింగ్లకు పతకాలు వరించాయి. ఒలింపిక్స్ ఒకే ఎడిషన్లో భారత షూటింగ్ బృందం మూడు పతకాలు సాధించడం కూడా ఇదే తొలిసారి.

హిందూస్తాన్ సమచార్

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్.. / నాగరాజ్ రావు


 rajesh pande