ఇరాన్, 21 ఆగస్టు (హి.స.)
సెంట్రల్ ఇరాన్ ప్రావిన్స్ యాజ్ఞాలో
ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పాకిస్థానీ యాత్రికులతో వెళ్తున్న బస్సు అతివేగంతో అదుపతప్పి బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో మొత్తం 30 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా మరో 23 మంది తీవ్ర గాయాలయ్యాయి. బస్సు బ్రేకింగ్ సిస్టమ్లో తలెత్తిన సాంకేతిక సమస్య వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఇరాన్ ట్రాఫిక్ పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. మృతులంతా ఇరాక్ లోని కర్బలా గవర్నరేట్లో షియా ముస్లింల అర్బయిన్ తీర్థ యాత్రకు వచ్చిన పాకిస్థానీయులుగా ఉన్నతాధికారులు తేల్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్ / నాగరాజ్ రావు