హైదరాబాదులో ఘనంగా జరిగిన సరిపోదా శనివారం ఫ్రీ రిలీజ్ వేడుక
వినోదం, 25 ఆగస్టు (హి.స.) నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ వివేక్ ఆత్రేయ మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ 'సరిపోదా శనివారం'. ఈ చిత్రాన్ని డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్, భారీ కాన్వాస్తో నిర్మించారు. ఆగస్టు
సరిపోదా శనివారం ఫ్రీ రిలీజ్


వినోదం, 25 ఆగస్టు (హి.స.)

నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ వివేక్ ఆత్రేయ మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ 'సరిపోదా శనివారం'. ఈ చిత్రాన్ని డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్, భారీ కాన్వాస్తో నిర్మించారు. ఆగస్టు 29న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం గ్రాండ్గా విడుదల కానుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా 'సరిపోదా శనివారం' ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్లోని నోవాటెల్లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సరిమప.. ప్రమోషనల్ సాంగ్ కూడా విడుదలైంది.

ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ.. అందరికీ థాంక్స్. ఈరోజు వచ్చిన దర్శకులకు నాతో కనెక్షన్ ఉంది. త్వరలో అది మీకు తెలుస్తుంది. సినిమా గురించి చాలా చెప్పేశాను. టీజర్, ట్రైలర్ ఏది రిలీజ్ చేసినా అందరూ ఓన్ చేసుకుని ఆదరించారు. ట్రైలర్లో చిన్నగా అరిచాను. ఈనెల 29న అందరూ అంతరేంజ్లో సక్సెస్ ఇవ్వాలి. వివేక్ శివతాండవం ఈ సినిమాలో చూపించాడు. අධි వివేకు మైల్ స్టోన్లా ఉండబోతుంది. మా కష్టాన్ని చూసి మీరు ఎంజాయ్ చేస్తారని భావిస్తున్నా. సాయికుమార్ నాకు ఫాదర్గా చేశారు. ఆయనతో నటించడం పాజిటివ్ వైబ్రేషన్ వస్తాయి. ప్రియాంకను ఆఫ్ స్క్రీన్లో చూస్తే ప్రేమలో పడతారు. ఈ సినిమాలో సూర్య, చారు పాత్రలను దర్శకుడు వివేక్ చక్కగా డీల్ చేశాడు. ఇక ఎస్.జె. సూర్య పాత్రకు మంచి పేరు వస్తుంది. ఆగస్టు 29న పోతారు. అందరూ థియేటర్కు పోతారు. 29న సరిపోదా శనివారం చూస్తారు అని అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్ / నాగరాజ్ రావు


 rajesh pande