గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 'గేమ్ చేంజర్' మూవీ రిలీజ్ పై కీలక అప్డేట్
హైదరాబాద్, వినోదం, 26 ఆగస్టు (హి.స.) గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం 'గేమ్ ఛేంజర్' సినిమాతో బిజీగా ఉన్నాడు. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తుండగా.. అంజలి కీలక పాత్రలో కనిపించ
గేమ్ చేజర్ మూవీ రిలీజ్ డేట్


హైదరాబాద్, వినోదం, 26 ఆగస్టు (హి.స.)

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం 'గేమ్ ఛేంజర్' సినిమాతో బిజీగా ఉన్నాడు. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తుండగా.. అంజలి కీలక పాత్రలో కనిపించనుంది. అయితే.. ఈ సినిమాలో చర్రీకి సంబంధించిన షూటింగ్ ఆల్ మోస్ట్ కంప్లీట్ అయినట్లు ఇటీవల మూవీ టీమ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే 'గేమ్ ఛేంజర్' రిలీజ్కు సంబంధించి ఏదో ఒక న్యూస్ నెట్టింట వైరల్ అవుతూనే ఉంది. దీంతో అసలు సినిమా ఎప్పుడు వస్తుందో అనే డైలామాలో ఉండిపోయారు ఫ్యాన్స్. ఈ మేరకు అభిమానులకు గుడ్ న్యూస్ అందిందనే చెప్పొకోవచ్చు.

రాంచరణ్ పీఆర్ టీం ప్రకారం 'గేమ్ ఛేంజర్' మూవీ రిలీజ్ డేట్పై క్లారిటీ వచ్చినట్లు తెలుస్తుంది. ఈ మేరకు పీఆర్ టీం నుంచి అందిన సమాచారం మేరకు రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా డిసెంబర్లో గ్రాండ్గా విడుదల కానుందని టాక్. ప్రజెంట్ ఈ న్యూస్ నెట్టింట వైరల్ కావడంతో.. అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. రిలీజ్ డేట్పై ఇక అఫీషియల్ అనౌన్స్మెంట్ రావడమే ఆలస్యమని తెలియడంతో ఆనందంలో ఎగిరిగంతేస్తున్నారు ఫ్యాన్స్. కాగా.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు ఈ మూవీని తెరకెక్కిస్తుండగా.. పాపులర్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు కథ నందిస్తున్నాడు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్ / నాగరాజ్ రావు


 rajesh pande