బిజినెస్, 27 ఆగస్టు (హి.స.)
ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ ఓరల్ కలరా వ్యాక్సిన్ (OCV)ని ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ మేరకు హిల్ కాల్ పేరుతో ఓరల్ వ్యాక్సిన్ను తాజాగా విడుదల చేసింది. సింగపూర్కు చెందిన హిల్మాన్ లేబొరేటరీస్ లైసెన్స్తో ఈ వ్యాక్సిన్ను అభివృద్ధి చేసినట్లు భారత్ బయోటెక్ ఒక ప్రకటనలో తెలిపింది. హైదరాబాద్, భువనేశ్వర్లలో 200 మిలియన్ డోస్లను ఉత్పత్తి చేయగల సామర్థ్యంతో పెద్ద ఎత్తున తయారీ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొంది.
కలరా వ్యాప్తిని నిరోధించడానికి, టీకాలు ఉత్తమంగా ఉంటాయని భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్లా వెల్లడించారు. 2021 నుంచి ప్రపంచంలో కలరా కేసులు, మరణాలు క్రమంగా పెరిగాయన్నారు. 2023 ప్రారంభం నుంచి ఈ ఏడాది మార్చి వరకు, 31 దేశాలలో 8,24,479 మందికి కలరా సోకగా , 5,900 మరణాలు నమోదయ్యాయని వెల్లడించారు. దాదాపు 31 దేశాల్లో ఈ సమస్య అధికంగా ఉందన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్ / నాగరాజ్ రావు