ఆసిఫాబాద్, 31 ఆగస్టు (హి.స.)
జిల్లాలో అక్రమ కార్యాకలాపాలకు పాల్పడే వారిపై పీడీ యాక్ట్ కేసు నమోదు చేస్తామని జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు హెచ్చరించారు. భూ అక్రమ కబ్జా, బెదిరింపులకు పాల్పడే వారు, లైసెన్స్ లేకుండా ఫైనాన్షియల్ చిట్టి, చైన్ మార్కెటింగ్ పేరుతో డబ్బులు వసూలు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే ఆన్ లైన్ మోసాలు, అక్రమ పశువుల రవాణా చేసేవారిపై పీడీ యాక్ట్ కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. దీనికి సంబంధించి 100 లేదా 8712670505 ఫోన్ నెంబర్ సమాచారం ఇచ్చి పోలిసులకు సహకరించాలని కోరారు
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..