హైదరాబాద్, 31 ఆగస్టు (హి.స.)
హైదరాబాద్లోని పబ్లపై ఎక్సైజ్ శాఖ
అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహిచారు. టీజీ నాబ్,- ఎక్సైజ్ అధికారులు సంయుక్తంగా సోదాలు చేపట్టారు. నగరంలోని 25 ప్రముఖ పబ్లలో ప్రత్యేక బృందాలతో సోదాలు జరిపారు. డ్రగ్స్ వినియోగిస్తున్నారన్న సమాచారం మేరకు తనిఖీలు చేపట్టిన అధికారులు.. పలువురికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించారు. కాగా, ఇటీవల హైదరాబాద్ పబ్ల డ్రగ్స్ వినియోగం పెరిగిపోతోందని పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో డ్రగ్స్ వినియోగం, స్మగ్లింగ్ పై ఉక్కపాదం మోపాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో అధికారులు ఎక్కిడికక్కడ తనిఖీలు చేపడుతున్నారు. డ్రగ్స్ ను గుర్తించే స్పెషల్ స్నిఫర్ డాగ్స్ ను సైతం రంగంలోకి దింపి ఆకస్మిక రైడ్స్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే శుక్రవారం రాత్రి నగరంలోని పలు పబ్ ల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.
ఇటీవలే హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో 25 పబ్లు, బార్ అండ్ రెస్టారెంట్లపై ఆకస్మిక దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. హైదరాబాద్ పరిధిలో 12, రంగారెడ్డి జిల్లాలో 13 ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వి.బి.కమలాసన్రెడ్డి, జాయింట్ కమిషనర్ ఖురేషీ ఆదేశాలతో.. అసిస్టెంట్ కమిషనర్లు ఆర్.కిషన్, అనిల్ కుమార్రెడ్డి, అడిషనల్ ఎస్పీ భాస్కర్ నేతృత్వంలో ఈడీ అధికారులు సోదాలు జరిపారు.
డ్రగ్స్ వినియోగంపై ప్రభుత్వం
ఉక్కుపాదం మోపుతున్నది. మత్తు పదార్థాల వినియోగాన్ని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ మత్తుబాబు మాత్రం రెచ్చిపోతూనే ఉన్నారు. తాజాగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో అర్ధరాత్రి ఎక్సైజ్, టీఎస్ నాబ్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ రెయిడ్స్ లో డ్రగ్స్ వినియోగిస్తున్న వారి బాగోతం బట్టబయలైంది. మొత్తం 25 పబ్ లలో సోదారు నిర్వహించిన అధికారులు పబ్బుల్లో 107 మంది అనుమానితులకు డ్రగ్ డిటెక్షన్ కిట్లతో పరీక్షలు నిర్వహించారు. ఈ టెస్టుల్లో ఆరుగురు డ్రగ్స్ సేవించినట్లు తెలింది. గత రాత్రి 11 గంటల నుంచి ఒంటి గంట వరకు ఈ తనిఖీలు కొనసాగాయి
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల
పరిధిలోని పలు పబ్స్ పై శుక్రవారం రాత్రి తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో దాడులు నిర్వహించింది. రాత్రి 11 గంటల నుంచి అర్ధ రాత్రి 1గంటల వరకు పబ్స్ లో రైడ్స్ జరిపినట్లు అధికారులు తెలిపారు. నగరంలో 25 పబ్స్ పై దాడులు నిర్వహించి, 130కి పైగా డ్రగ్స్ పరీక్షలు చేసినట్లు నార్కోటిక్ పోలీసులు వెల్లడించారు. ఈ టెస్టుల్లో 6 మందికి డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది. బంజారాహిల్స్ లోని క్లబ్ రోగ్ పబ్ లో ఒక కేసు, జోరో పబ్ లో ఒకరు, జీరో40లో ఇద్దరు, రాయదుర్గం పరిధిలోని విస్కీ సాంబలో ఇద్దరికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు..
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..