ఉగ్ర రూపం తో .గోదావరి పొంగి ప్రవహిస్తోంది
రాజమండ్రి, 11 సెప్టెంబర్ (హి.స.): ఉగ్రరూపంతో గోదావరి పొంగి ప్రవహిస్తోంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. గంట గంటకూ గోదావరి వరద ప్రవాహం పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు గోదావరిలో కలుస్తో
ఉగ్ర రూపం తో .గోదావరి పొంగి ప్రవహిస్తోంది


రాజమండ్రి, 11 సెప్టెంబర్ (హి.స.): ఉగ్రరూపంతో గోదావరి పొంగి ప్రవహిస్తోంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. గంట గంటకూ గోదావరి వరద ప్రవాహం పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు గోదావరిలో కలుస్తోంది. బ్యారేజ్ వద్ద నీటి మట్టం 14.20 అడుగులకు పెరిగింది. బ్యారేజ్‌కు చెందిన 175 గేట్లు పూర్తిగా ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. బ్యారేజ్ నుంచి 13.27 లక్షల క్యూసెక్కులు వరద నీరు దిగువకు విడుదల చేయడం జరుగుతోంది. పాపికొండల విహార యాత్ర తాత్కాలికంగా అధికారులు నిలిపివేశారు. గోదావరి వరద నేపథ్యంలో తూర్పుగోదావరి, అల్లూరి, అంబేద్కర్ కోనసీమ జిల్లాల కలెక్టర్లు అప్రమత్తమయ్యారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల


 rajesh pande