తాను మార్కెట్ రెగ్యులేటరీ నిబంధనలను అతిక్రమించలేదు.. సెబీ చీఫ్ మధబి పురి బుచ్..
బిజినెస్, 13 సెప్టెంబర్ (హి.స.) ఇటీవల వరుసగా తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న మార్కెట్ రెగ్యులేటరీ సంస్థ (సెబీ) చీఫ్ మధబి పురీ బుచ్ తాజాగా స్పందించారు. ఈ మేరకు శుక్రవారం తన భర్తతో కలిసి ఒక ప్రకటన విడుదల చేసిన ఆమె.. మార్కెట్ రెగ్యులేటరీ నిబంధనలు అతిక్రమి
సెబీ చీఫ్ మధబి పురి బుచ్


బిజినెస్, 13 సెప్టెంబర్ (హి.స.)

ఇటీవల వరుసగా తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న మార్కెట్ రెగ్యులేటరీ సంస్థ (సెబీ) చీఫ్ మధబి పురీ బుచ్ తాజాగా స్పందించారు. ఈ మేరకు శుక్రవారం తన భర్తతో కలిసి ఒక ప్రకటన విడుదల చేసిన ఆమె.. మార్కెట్ రెగ్యులేటరీ నిబంధనలు అతిక్రమించలేదని, అన్ని మార్గదర్శకాలకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. తనపై వచ్చిన ఆరోపణలను తోసిపుచ్చుతూ, అవి దురద్దేశపూరితమైనవని, అబద్దపు ఆరోపణలని అన్నారు.

ఇదిలా ఉంటే అదానీ కంపెనీల షేర్ల విలువ పెరగడానికి సహకరించిన విదేశీ ఫండ్లలో సెబీ చీఫ్ పెట్టుబడులు పెట్టారని అమెరికా షార్ట్ సెల్లింగ్ సంస్థ హిండెన్బర్గ్ ఆరోపణలు చేసింది. అందుకే అదానీ గ్రూప్పై చర్యలు తీసుకోలేదని పేర్కొంది. అలాగే, సెబీ చీఫ్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా ఆమెకు ఐసీఐసీఐ బ్యాంకు నుంచి జీతభత్యాలు అందుతున్నాయంటూ కాంగ్రెస్ ఆరోపణలు చేసింది. ఇంకా, ఆమె భర్త ధవల్ బుచ్ 2019- 2021 మధ్య మహీంద్రా అండ్ మహీంద్రా (ఎం అండ్ ఎం) నుండి రూ.4.78 కోట్లు పొందారని ఆరోపించింది. వరుసగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సెబీ చీఫ్, ఆమె భర్త స్పందిస్తూ తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్


 rajesh pande