బంగ్లాదేశ్లో మైనార్టీలపై జరుగుతున్న హింసను దర్యాప్తు చేయడానికి రాజధాని ఢాకాకి చేరుకున్న ఐక్యరాజ్యసమితి మానవహక్కుల పర్యవేక్షణ బృందం
న్యూఢిల్లీ, 17 సెప్టెంబర్ (హి.స.) బంగ్లాదేశ్ లో నెలకొన్న హింసాత్మక ఘటనలతో ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేయాల్సి వచ్చింది. అవామీ లీగ్ ప్రభుత్వం పడిపోయినప్పట్నుంచి అక్కడ హిందువులు,ఇతరమైనారిటీలపై దాడులు జరుగుతున్నాయి. మైనారిటీ మహిళలపై అఘాయిత్య
బంగ్లాదేశ్ చేరుకున్న ఐక్యరాజ్యసమితి బృందం


న్యూఢిల్లీ, 17 సెప్టెంబర్ (హి.స.)

బంగ్లాదేశ్ లో నెలకొన్న హింసాత్మక ఘటనలతో ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేయాల్సి వచ్చింది. అవామీ లీగ్ ప్రభుత్వం

పడిపోయినప్పట్నుంచి అక్కడ హిందువులు,ఇతరమైనారిటీలపై దాడులు జరుగుతున్నాయి.

మైనారిటీ మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. హిందూ ఆలయాలు, వ్యాపారులపై దాడులు చేశారు. ఇదిలా ఉంటే, మైనారిటీలపై హింసను దర్యాప్తు చేయడానికి ఐక్యరాజ్యసమితి మానవహక్కుల

పర్యవేక్షణ బృంధం బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకి చేరుకుంది. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి ఒక నెలపాటు బంగ్లాదేశ్లో ఉండి.. అక్కడి హింసాత్మక ఆరోపణలపై విచారణ జరుపుతుంది.

తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కూడా దాడులు నోబెల్ శాంతి గ్రహీత మహ్మద్ యూనస్ బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా బాధ్యతలు తీసుకున్న తర్వాత కూడా అక్కడి మైనారిటీలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. జమాతే ఇస్లామీ వంటి తీవ్రవాదసంస్థతో పాటు ఇతర ర్యాడికల్ ముస్లిం ఆర్గనైజేషన్లు మైనారిటీలపై దాడులకు పాల్పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. .. నెలపాటు ఐక్యరాజ్యసమితి మానవహక్కుల పర్యవేక్షణ బృందం బంగ్లాదేశ్లో ఉండి హింసాత్మక ఆరోపణలపై విచారణ జరుపుతుంది. ఇకపోతే, హిందూ మైనారిటీ గ్రూపులు యూఎన్ బృందాన్ని కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు. బంగాబంధు ఫౌండేషన్ తరపున, వారు ప్రతినిధి బృందంతో సమావేశం కావాలని అభ్యర్థించారు. భారీగా హత్యలు జరిగాయని, హిందూ ప్రార్థనా స్థలాలు, నివాసాలు ధ్వంసమైనట్లు పేర్కొంటూ వారు ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటినియో గుటెర్రస్కి లేఖ కూడా రాశారు. ఆగస్టు 5 తర్వాత, భారీ హత్యలు జరిగాయని.. మైనారిటీ వర్గాలకు చెందిన ఇళ్లు, ఆలయాలు, అవామీలీగ్ నాయకులు, కార్యకర్తల ఇళ్లు ధ్వంసం అయ్యాయి. జూలై 16 నుంచి ఆగస్టు 11 మధ్యలో 600 మంది మరణించారని తెలుస్తోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande