కొత్త కస్టమర్లను చేర్చుకోవడంలో బిఎస్ఎన్ఎల్ రికార్డ్
బిజినెస్, 21 సెప్టెంబర్ (హి.స.) ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ రికార్డు సృష్టించింది.. ఒకప్పుడు వినియోగదారుల కొరతతో బాధపడుతున్న ఈ ప్రభుత్వ సంస్థలో కొత్త వినియోగదారులు చేరడం ప్రారంభించారు. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) నివేదిక ప
బిఎస్ఎన్ఎల్ రికార్డు


బిజినెస్, 21 సెప్టెంబర్ (హి.స.)

ప్రభుత్వ టెలికాం సంస్థ

బీఎస్ఎన్ఎల్ రికార్డు సృష్టించింది.. ఒకప్పుడు వినియోగదారుల కొరతతో బాధపడుతున్న ఈ ప్రభుత్వ సంస్థలో కొత్త వినియోగదారులు చేరడం ప్రారంభించారు. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) నివేదిక ప్రకారం, జూలైలో దాదాపు 30 లక్షల మంది కొత్త వినియోగదారులు BSNLలో చేరారు. మరోవైపు, ప్రైవేట్ కంపెనీల ( జియో, ఎయిర్టెల్, విఐ అంటే వోడాఫోన్ ఐడియా) వినియోగదారుల సంఖ్య భారీగా తగ్గింది. TRAI నివేదిక ప్రకారం BSNL వినియోగదారుల సంఖ్య అంతకంతకు పెరుగుతుండగా, ప్రైవేట్ కంపెనీల వినియోగదారుల సంఖ్య తగ్గుతోంది.

BSNL వినియోగదారుల సంఖ్య పెరగడానికి ప్రధాన కారణం దాని టారిఫ్ ప్లాన్లు చౌకగా ఉండడమే. జూలై ప్రారంభంలో ఇతర ప్రైవేట్ టెలికాం కంపెనీలు తమ టారిఫ్ ప్లాన్లను చాలా ఖరీదైనవిగా చేశాయి. వాటి ధరలను 11 నుంచి 25 శాతం పెంచారు. మరోవైపు BSNL టారిఫ్ ప్లాన్లో ఎటువంటి పెరుగుదల చేయలేదు. దీని కారణంగా చాలా మంది వినియోగదారులు తమ నంబర్లను ప్రైవేట్ కంపెనీల నుంచి BSNLకి పోర్ట్ చేశారు. దీంతో BSNLకి కనెక్ట్ అయ్యే వినియోగదారుల సంఖ్య పెరిగింది.

ఇదే మొదటిసారి..

BSNL ఒక నెలలో కొత్త కస్టమర్లను ఇంత ఎక్కువగా చేర్చుకోవడం బహుశా ఇదే మొదటిసారి. కొంతమంది విశ్లేషకులు మాట్లాడుతూ ఇప్పటివరకు ఎప్పుడూ కూడా BSNL ప్రైవేట్ కంపెనీల కస్టమర్లను ఈ స్థాయిలో చేర్చుకున్నట్లు తమకు గుర్తులేదన్నారు. BSNL చౌక టారిఫ్ ప్లాన్లే దీనికి అతిపెద్ద కారణమని వారు అన్నారు.

యాక్టివ్ యూజర్ల విషయంలో కూడా BSNL ముందుంది...

యాక్టివ్ యూజర్ల విషయంలో BSNL మూడు ప్రైవేట్ టెలికాం కంపెనీల కన్నా ముందుంది. BSNL చందాదారులు జూలైలో 2.91 మిలియన్లు పెరిగి 49.49 మిలియన్లకు చేరుకున్నారు. Vi 3.03 మిలియన్లను కోల్పోగా , Airtel 1.17 మిలియన్లను Jio 210,000 క్రియాశీల వినియోగదారులను కోల్పోయింది.

త్వరలో 5G నెట్వర్క్..

BSNL ప్రస్తుతం తన వినియోగదారులకు 5G సేవలను

అందించడం లేదు. ఇందుకోసం ఈ సంస్థ శరవేగంగా కసరత్తు చేస్తోంది. కంపెనీ తన కొత్త 4G ప్లాన్లను

ప్రవేశపెట్టింది. BSNL మార్చి 2025 నాటికి భారతదేశం అంతటా తన 4G సేవలను ప్రారంభించాలని లక్ష్యంగా

పెట్టుకుంది. దీని తర్వాత కంపెనీ 6 నుండి 8 నెలల్లో 5G సేవలను కూడా ప్రారంభిస్తుందని తెలిపారు. 2025

చివరి నాటికి BSNL 25 శాతం కస్టమర్ మార్కెట్ వాటాను సాధించాలని ప్రభుత్వం లక్ష్యంగా

పెట్టుకుందంటున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్


 rajesh pande