భారత్లో కార్యకలాపాలు ప్రారంభించనున్న ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ కంపెనీ జేపీ మోర్గాన్
బిజినెస్, 24 సెప్టెంబర్ (హి.స.) ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్ వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఈ నేపథ్యంలో పెట్టుబడిదారుల చూపు భారత్పై పడింది. గత కొన్నేళ్లుగా దేశంలోకి వివిధ రంగాల్లో ఇన్వెస్ట్మెంట్లు భారీగా పెరుగుతున్నాయి. దీంతో వివిధ అంతర్జాతీయ సంస్థలు
జేపీ మోర్గాన్ కంపెనీ భారత్కు రాక


బిజినెస్, 24 సెప్టెంబర్ (హి.స.)

ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్ వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఈ నేపథ్యంలో పెట్టుబడిదారుల చూపు భారత్పై పడింది. గత కొన్నేళ్లుగా దేశంలోకి వివిధ రంగాల్లో ఇన్వెస్ట్మెంట్లు భారీగా పెరుగుతున్నాయి. దీంతో వివిధ అంతర్జాతీయ సంస్థలు తమ కార్యకలపాలను భారత్లో కూడా విస్తరించాలని చూస్తున్నాయి. తాజాగా ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ కంపెనీ జేపీ మోర్గాన్ భారతదేశంలో తన కార్యకలాపాలను పెంచుకోవాలని యోచిస్తోంది. దాని ఉన్నతాధికారి ఫిలిప్పో గోరీ మాట్లాడుతూ, భారత్లోకి వచ్చే క్లయింట్లతో చర్చలు జరపడానికి, డీల్స్ చేసుకోడానికి అమెరికా తరువాత ఇక్కడ కార్యకలాపాలను మరింత విస్తరించాలని చూస్తున్నట్లు తెలిపారు.

హెల్త్కేర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాలలో లావాదేవీలే కాకుండా, ఇండియా ఫర్ ఇండియా”, ఇండియా ఫర్ ది వరల్డ్ వంటి డీల్ మేకింగ్ కార్యకలాపాల ద్వారా భారత్కు వచ్చే క్లయింట్ల సంఖ్య పెరుగుతుంది, ఈ నేపథ్యంలో ఇక్కడి నుంచి అన్ని దేశాలతో వ్యాపార కనెక్టివిటీని పెంచుకోవడానికి విస్తరణ చాలా అవసరమని గోరీ చెప్పారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande