బిజినెస్, 25 సెప్టెంబర్ (హి.స.)
ప్రపంచ దేశాలతో పోలిస్తే,భారత్ వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ 7 శాతం వృద్ధిని సాధించగలదని ఆసియా అభివృద్ధి బ్యాంకు (ADB) అంచనా వేసింది. బుధవారం నాడు విడుదలైన నివేదిక ప్రకారం, ఆర్థిక సవాళ్లు ఉన్నప్పటికీ కూడా వాటన్నింటిని భారత్ దాటుకుంటూ అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని పేర్కొంది. ఇదే ఊపును కొనసాగిస్తూ, ఎఫ్ వై24లో(31 మార్చి 2025 నాటికి) భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి 7 శాతం, ఎత్వై25లో 7.2 శాతం వద్ద వృద్ధి చెందుతుందని ADB అంచనా వేస్తోంది. అలాగే, ఆసియా, పసిఫిక్ ప్రాంతాలకు FY24వృద్ధి అంచనాను ఏప్రిల్ 4.9 శాతం నుండి 5 శాతానికి పెంచగా, FY25లో 4.9 శాతం వృద్ధి చెందుతుందని అంచనా వేసింది. 'ఆసియన్ డెవలప్మెంట్ ఔట్లుక్ (ADO) సెప్టెంబర్ 2024'లో భాగంగా ఈ నివేదికను విడుదల చేశారు.
అభివృద్ధి చెందుతున్న ఆసియా, పసిఫిక్ ప్రాంతాల్లో ద్రవ్యోల్బణం 2024లో 2.8%కి తగ్గుతుందని, ఇది మునుపటి అంచనా 3.2%తో పోలిస్తే తగ్గుదల అని ఆసియా అభివృద్ధి బ్యాంకు పేర్కొంది. ప్రపంచ భౌగోళిక రాజకీయ సవాళ్లను ఎదుర్కొనేందుకు భారతదేశ ఆర్థిక వ్యవస్థ ధృఢంగా ఉంది. పరిశ్రమలు, సేవల రంగాల్లో బలమైన పనితీరు, వ్యవసాయ మెరుగుదల కారణంగా గ్రామీణ వ్యయం పెరగడం, కొత్త పెట్టుబడులు భారీగా పెరగడం వంటి అంశాల కారణంగా భారత్ స్థిరమైన వృద్ధికి సిద్ధంగా ఉందని ఇండియా ADB కంట్రీ డైరెక్టర్ మియో ఓకా అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..