న్యూఢిల్లీ, 27 సెప్టెంబర్ (హి.స.)
దేశ వ్యాప్తంగా డ్రగ్స్ వినియోగం విచ్చలవిడిగా పెరిగిపోతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. విదేశాల నుంచి అక్రమంగా వస్తున్న డగ్స్పై ఉక్కుపాదం మోపాలని సూచించింది. దీంతో దేశంలోని ప్రధాన ఎయిర్పోర్టులు ఓడరేవు లను
కస్టమ్స్ అధికారులు జల్లెడ
పడుతున్నారు. అనుమానం వచ్చిన ప్రతి బ్యాగేజీలు,కంటైనర్లను క్లియర్ చెక్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే
శుక్రవారం తెల్లవారుజామున చెన్నై పోర్టు కస్టమ్స్ అధికారులు భారీగా డ్రగ్స్ను సీజ్ చేశారు. ఓ ముఠా కంటైనర్లో అక్రమంగా విదేశాలకు
తరలిస్తున్న రూ.110 కోట్ల విలువైన నిషేధిత డ్రగ్స్ను వారు గుర్తించారు. అయితే, చెన్నై పోర్టు నుంచి ఆస్ట్రేలియా కు డ్రగ్స్ తరలిస్తున్నట్లుగా ప్రాథమిక విచారణ లో వెల్లడైంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..