,
దిల్లీ, 28 సెప్టెంబర్ (హి.స.)హెజ్‌బొల్లా (Hezbollah) లక్ష్యంగా దాడులు కొనసాగిస్తున్న ఇజ్రాయెల్ (Israel) శుక్రవారం భీకర స్థాయిలో విరుచుకుపడింది. ఈ క్రమంలోనే బీరుట్‌లోని హెజ్‌బొల్లా ప్రధాన కార్యాలయంపై విధ్వంసకర బాంబులను ప్రయోగించింది. ఈ దాడుల్లో హెజ్‌బొల్లా అధిపతి హసన్ నస్రల్లా (Hassan Nasrallah) మరణించినట్లు తాజాగా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ధ్రువీకరించింది. ఈ మేరకు తమ ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేసింది. ‘‘నస్రల్లా ఇక ఈ ప్రపంచాన్ని ఉగ్రవాదంతో భయభ్రాంతులకు గురిచేయలేడు’’ అని రాసుకొచ్చింది. అటు ఇజ్రాయెల్ వార్ రూమ్ దీనిపై స్పందించింది. ‘ఆపరేషన్ న్యూ ఆర్డర్’ మిషన్ విజయవంతమైనట్లు వెల్లడించింది.
శుక్రవారం రాత్రి దక్షిణ లెబనాన్ (Lebanon)లోని దాహియాలోని నివాసగృహాల కింద భూగర్భంలో ఉన్న హెజ్‌బొల్లా ప్రధాన కార్యాలయంపై ఐడీఎఫ్ (IDF) వైమానిక దాడులు చేసిన సంగతి తెలిసిం
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు